Tadepalli Gang Rape: తాడేపల్లి అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రులు సుచరిత, వనిత.. రూ. 50 వేల సాయం అందజేత..

|

Jun 21, 2021 | 5:07 PM

Tadepalli Gang Rape: గుంటూరు జిల్లా తాడేపల్లి అత్యాచార ఘటన బాధితురాలిని మంత్రులు సుచరిత, వనిత పరామర్శించారు. ముఖ్యమంత్రి...

Tadepalli Gang Rape: తాడేపల్లి అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రులు సుచరిత, వనిత.. రూ. 50 వేల సాయం అందజేత..
Home Minister Sucharitha
Follow us on

Tadepalli Gang Rape: గుంటూరు జిల్లా తాడేపల్లి అత్యాచార ఘటన బాధితురాలిని మంత్రులు సుచరిత, వనిత పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో సోమవారం నాడు మంత్రులిద్దరూ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలిని పరామర్శించిన అనంతరం మంత్రులిద్దరూ మీడియాతో మాట్లాడారు. హత్యాచార ఘటనను హేయమైన చర్యగా అభివర్ణినంచారు హోంమంత్రి మేకతోటి సుచరిత. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గలిస్తున్నాయని హోంమంత్రి చెప్పారు.

కాగా, బాధితురాలికి తక్షణ సహాయంగా రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినట్లు మంత్రి సుచరిత తెలిపారు. కాగా, మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున బాధితురాలికి రూ. 50 వేల తక్షణ సహాయాన్ని మంత్రి తానేటి వనిత అందించారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద నదీ తీరంలో సేదతీరుతున్న ప్రేమజంటపై దుండగులు దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కాళ్ళు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నాడు చోటు చేసుకున్న ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ దురాఘతానికి పాల్పడింది గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అని పోలీసులు అంచనాకు వచ్చారు. వారిలో ఒకరిని గుర్తించి ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరొకరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Home Minister Media Byte:

Also read:

Keerthy Suresh: పాట్న‌ర్‌తో పిక్‌నిక్‌ ఎంజాయ్ చేస్తోన్న కీర్తి… ఇంత‌కా పాట్న‌ర్‌ ఎవరంటే..?? ( వీడియో )

Railway Insurance : రైల్వే ప్రయాణికులకు గమనిక..! 49 పైసలకే 10 లక్షల రైల్వే ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..