Andhra Pradesh: ఆ రెండు అంశాలు చంద్రబాబును టెన్షన్ పెడుతున్నాయి.. షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి రోజా..
Andhra Pradesh: టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చే కుటిల ప్రయత్నాలు..
Andhra Pradesh: టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చే కుటిల ప్రయత్నాలు చేస్తారంటూ ధ్వజమెత్తారు. కుప్పం టెన్షన్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. సీఎం జగన్ ఎప్పుడెప్పుడు బట్ నొక్కి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడతారో.. అప్పుడు చంద్రబాబు ఏదో ఒక రకంగా సంక్షోభం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మేలు జరుగడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన కారణంగా.. చంద్రబాబుకు కుప్పం కోట కూలిపోతుందని తెలిసి పోయిందని అన్నారు. ఒక ఆడపిల్ల అయిన ఎంపీపీ మీద దాడిచేయడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు మంత్రి రోజా.
ఇక్కడ జగన్‌ను ఫేస్ చేయలేక.. మరోవైపు అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అవడం చంద్రబాబులో ఒణుకు పుట్టిస్తోందని వ్యాఖ్యానించారు మంత్రి రోజా. ఇటీవల బాలకృష్ణ ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య రథం మీద చంద్రబాబు ఫోటో లేకపోవడం కూడా.. గుర్తించాల్సిన విషయమని అన్నారు. తనకు అన్ని రకాలుగా కష్టకాలం ఎదురవడంతో.. ఏం చేయాలో అర్ధం కాక ఫ్రస్టేషన్లో బాబు ఏదేదో చేస్తున్నారని విమర్శించారు మంత్రి రోజా. చంద్రబాబు పిచ్చాస్పత్రిలో చేరే రోజు దగ్గర్లో ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి రోజా.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..