Roja: గరిట తిప్పి చికెన్‌ వండిన రోజా.. దత్తత గ్రామంలో మంత్రి ఇఫ్తార్‌ విందు

పవిత్ర రంజాన్‌ పండుగను పురస్కరించుకొని మంత్రి ఆర్కే రోజా ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు ఈ విందును ముస్లింలకు స్వయంగా రోజానే ఇచ్చారు. దత్తత గ్రామం మీరా సాహెబ్‌ పాలెంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోజా గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. స్వయంగా మంత్రి..

Roja: గరిట తిప్పి చికెన్‌ వండిన రోజా.. దత్తత గ్రామంలో మంత్రి ఇఫ్తార్‌ విందు
Roja

Updated on: Apr 20, 2023 | 8:16 PM

పవిత్ర రంజాన్‌ పండుగను పురస్కరించుకొని మంత్రి ఆర్కే రోజా ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు ఈ విందును ముస్లింలకు స్వయంగా రోజానే ఇచ్చారు. దత్తత గ్రామం మీరా సాహెబ్‌ పాలెంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోజా గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. స్వయంగా మంత్రి వచ్చి వేడుకల్లో పాల్గొనడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇక మీరాసాహెబ్‌ పాళెం, వేలావడి గ్రామాల్లోని 2,380 కుటుంబాలకు పార్టీ శ్రేణుల ద్వారా విందు, చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా స్వయంగా గరెట పట్టడం విశేషం. ఇఫ్తార్‌ విందు ప్రారంభానికంటే ముందుగానే గ్రామానికి చేరుకున్న రోజా అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు. అనంతరం ముస్లింలకు కానుకలు అందజేశారు. కాగా గతంలో ఎన్నికల సమయంలో మీరాసాహెబ్‌ పాళెంలో పర్యటించిన రోజా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మాటిచ్చారు. అనంతరం అధికారికంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట మేరకు గ్రామాన్ని దత్తత తీసుకున్న రోజా.. పలు అభివృద్ధి పనులు చేయించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 18వ తేదీన కూడా రోజా ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. తన నివాసంలో ముస్లింలకు రోజా విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్న రోజా.. ‘ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా ముస్లిం సోదరురు భావిస్తారు, దానికి ప్రధానమైన కారణం ‘దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే `రమదాన్ మాసం` ఈ పవిత్రమైన మాసంలో ఈరొజు మా నివాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..