Kodali Nani on Pawan: జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.. పవన్ కళ్యాణ్‌కు మంత్రి కొడాలి నాని సవాల్

| Edited By: Janardhan Veluru

Sep 30, 2021 | 6:47 PM

Kodali Nani on Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళగిరి పార్టీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని గట్టి కౌంటరిచ్చారు.

Kodali Nani on Pawan: జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా..  పవన్ కళ్యాణ్‌కు మంత్రి కొడాలి నాని సవాల్
Minister Kodali Nai
Follow us on

Kodali Nani on Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళగిరి పార్టీ వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని గట్టి కౌంటరిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీవితంలో ఎప్పుడు జగన్ ను ఓడించలేడని కొడాలి నాని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని నాని సవాల్ విసిరారు. గురువారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకోవాలని నాని ఎద్దేవా చేశారు.

‘‘2024 లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం. జనసేన, చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి భయం లేదన్న మంత్రి.. వపన్‌ను చూసి ఆయన అభిమానులు భయపడతారన్నారు. గన్మోహన్‌రెడ్డి ఆ నాడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకే భయపడలేదు. నీవెంటి ఆయనను భయపెట్టేది. పవన్ ప్రసంగాలకు జనం భయపడతారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదివి మమ్మల్ని భయపెడతాడా. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్‌కల్యాణ్’’ అని కొడాలి నాని తీవ్రమైన వాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్.. Watch Video

Read Also… ap covid 19 Cases: ఏపీలో కాస్త పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 1,010 మందికి పాజిటివ్.. 13 మంది మృతి

‘పోసాని ఇంటిపై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదు’: తెలంగాణ జనసేన