జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఫైర్ అయ్యారు. వాలంటరీల్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ఏపీ వాసుల డేటా హైదరాబాద్‌లో ఉందన్న పవన్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ బొత్సా.. పవణ్ కళ్యాణ్, ఆయన పాట్నర్ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటారని యద్దేవా చేశారు. ఏపీ ప్రజల డేటా ప్రజల డేటాను హైదరాబాద్‌లో ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని బొత్స స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారన్న బొత్స.. పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదున్నారు. వాలంటీర్లు ఎవరో, ఎలా వచ్చారో, అసలు వాలంటరీ విధి విధానాలను పవన్‌కు తెలుసా.? అంటూ ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని మంత్రి అన్నారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ బురద చల్లాలని చూస్తున్నారన్నారు. ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చారో పవన్ కల్యాణ్ చెప్పాలని, నిఘా వర్గాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే పవన్ కళ్యాణ్ చూపించాలని బొత్స డిమాండ్ చేశారు.
ఇక చంద్రబాబు మీద కూడా బొత్స పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బొత్స మాట్లాడుతూ.. ‘చంద్రబాబు సన్నిహిత సింగపూర్ మంత్రిని అరెస్ట్ చేశారు. అమరావతిలో ఆ మంత్రిని తీసుకొచ్చి చంద్రబాబు అట్టహాసంగా ప్రచారం చేశారు. ఆనాడే చెప్పా సింగపూర్ ప్రభుత్వంతో ఏపి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కాదని’ అని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..