Sankranti: సంబరాల ‘రాంబాబు’.. మార్క్ డ్యాన్స్‌తో ఫెస్టివల్‌కే కొత్త జోష్ తెచ్చిన మంత్రి అంబటి..

|

Jan 14, 2023 | 8:30 AM

ప్రతి సంక్రాంతికీ చిరంజీవి, బాలకృష్ణ సినిమా వస్తుందో రాదో తెలీదు కానీ.. ఏపీ మంత్రి అంబటి మార్క్ నాట్య కళా చిత్రం మాత్రం పక్కా.. అంబటి రాంబాబు పండగ హంగామా అంబరాన్నంటింది.

Sankranti: సంబరాల ‘రాంబాబు’.. మార్క్ డ్యాన్స్‌తో ఫెస్టివల్‌కే కొత్త జోష్ తెచ్చిన మంత్రి అంబటి..
Ambati Rambabu Dance
Follow us on

ప్రతి సంక్రాంతికీ చిరంజీవి, బాలకృష్ణ సినిమా వస్తుందో రాదో తెలీదు కానీ.. ఏపీ మంత్రి అంబటి మార్క్ నాట్య కళా చిత్రం మాత్రం పక్కా.. అంబటి రాంబాబు పండగ హంగామా అంబరాన్నంటింది. ఆ ఊపు ఆ రూపు.. ఈ పండగ స్పెషల్ నేనే అనేస్తున్నారాయన. ఈ సంక్రాంతి హీరో నేనే అంటూ తెరమీదకు దూసుకొచ్చేశారు.

పండగంటే చాలు.. రాంబాబుకు కొత్త జోష్ వచ్చేస్తుంది.. ఆ ఆటలు పాటలు అంత మాములుగా ఉండవ్.. గతేడాది కూడా ఇంతే.. పండగంటే.. ఆయన కాలు కదలక మానదు.. చిందు వేయక తప్పదు.. పోయిన సారి జస్ట్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇచ్చిన రాంబాబు.. ఈ సారికి తనలోని.. నాట్య కళను మొత్తం బయట పెట్టేశారు. డ్యాన్సర్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ గా ప్రూవ్ చేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? ఆ లుక్ మొత్తం ఛేంజ్, ఆ డ్యాన్స్ లోనూ కావల్సినంత వైబ్రేషన్, ఏది ఏమైనా ఇప్పటి వరకూ చూస్తే ఈ సంక్రాంతి బెస్ట్ పెర్ఫామర్స్ అవార్డ్ గోస్ టూ అంబటి అనేలా ఉంది ఈ ఫెస్టివ్ సీన్ చూస్తుంటే.

భోగి సందర్భంగా అద్దిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపుతున్న మంత్రి అంబటి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..