Boy in Forest: రాత్రంతా క్రూర మృగాలు తిరిగే అడవిలోనే 8ఏళ్ల బాలుడు.. చివరికి ఏమైయింది అంటే..?
ఇంట్లోనే కాసేపు చీకట్లో ఉండాలంటే పిల్లలు భయపడతారు. అలాంటిది దట్టమైన అడవిలో.. కారు చీకట్లో రాత్రంతా గడపడం అంటే ఎంత దారుణంగా ఉంటుంది..
కడప జిల్లా బద్వేల్‌కి చెందిన ఓ పిల్లాడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఉమ్మడి కడప జిల్లాలోని పోరుమామిళ్ల మండలం కల్వకుంట్ల కు చెందిన సుమన్ తండ్రితో పశువులను మేపేందుకు నిన్న వెళ్లాడు. పిల్లాడు టేకురుపేట అడవి ప్రాంతంలో తప్పిపోయాడు. ఈ విషయమై సుమన్ తండ్రి అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఫారెస్ట్ అధికారులు.ఇదిలా ఉంటే.. తప్పిపోయిన ఎనిమిదేళ్ల సుమన్ అడవిలో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాడు . అడవిలో ఒంటరిగా అమ్మానాన్నల కోసం గుక్కపట్టి ఏడ్చాడు. క్రూర మృగాలు తిరిగే అడవిలో ప్రాణాలు అరచేత్తో పట్టుకుని తెల్లారే వరకూ కూర్చుని ఉన్నాడు. బాలుడు మిస్సింగ్‌పై సమాచారం అందుకున్న పోరుమామిళ్ల ఫారెస్ట్ సిబ్బంది ఉరుకులు పరుగుల మీద అడవిలోకి పరుగులు పెట్టారు. గ్రామస్తుల సహకారంతో రాత్రంతా అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేళకు జనవరి 4 ఉదయం బాలుడు క్షేమంగా కన్పించాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..