తలకోన జలపాతంలో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువకుడు..!

జలపాతం వద్ద ఈత కొడుతూ ఓ యువకుడు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో శుక్రవారం (జూన్‌ 30) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తలకోన జలపాతంలో బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన యువకుడు..!
Man Stuck Between Rocks

Updated on: Jul 01, 2023 | 1:11 PM

తిరుపతి: జలపాతం వద్ద ఈత కొడుతూ ఓ యువకుడు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో శుక్రవారం (జూన్‌ 30) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తిరుపతి జిల్లాలో తలకోన జలపాతం ప్రముఖ పర్యాటక ప్రాంతం. కర్ణాటక రాష్ట్రం మంగుళూరికి చెందిన సుమన్‌ (23) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి తలకోనకు విహారయాత్రకు వచ్చాడు. దీనిలో భాగంగా తలకోన జలపాతం సందర్శనకు వెళ్లిన సుమన్‌, అతని స్నేహితులు.. జలపాతంలో దిగి ఈతకొట్టడం ప్రారంభించారు.

ఈ క్రమంలో జలపాతంతో ఈత కొడుతూ సుమన్‌ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడు. గమనించిన అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించిన ఫలితంలేకపోయింది. చీకటి పడటంతో శనివారం ఉదయం తీస్తామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.