23 యేళ్లుగా ఊరికో వినాయక విగ్రహం ఫ్రీ.. ఉచితం అంటే చిన్నవి కావండోయ్‌! భా..రీ.. విగ్రహాలు

| Edited By: Srilakshmi C

Sep 17, 2023 | 2:04 PM

రాజకీయ నాయకులు ప్రజలకు ఏదో ఒకటి చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంటారు. కొందరు వివాహాలు జరిపిస్తారు. మరి కొందరు బట్టలు పంఛి పెడతారు. కాని కైకలూరు MLA దూలం నాగేశ్వరరావు మాత్రం గత 23 యేళ్లుగా వినాయక చవితికి ఉచితంగా విగ్రహాలను పంచి పెడుతున్నారు. చిన్న చిన్నవి కాదు మండపాల్లో ఏర్పాటు చేసుకునే భారీ విగ్రహాలు కావటంతో ప్రతియేటా వీటికోసం కైకలూరు వచ్చే భక్తులు సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. సర్వవిఘ్నాలు తొలగాలని విఘ్నాదిపతైన ఆ గణేశుడికి తొలి పూజ చేస్తారు.. వినాయక చవితి వచ్చిందంటే చాలు..

23 యేళ్లుగా ఊరికో వినాయక విగ్రహం ఫ్రీ.. ఉచితం అంటే చిన్నవి కావండోయ్‌! భా..రీ.. విగ్రహాలు
Kaikaluru MLA Dulam Nageswara Rao
Follow us on

ఏలూరు, సెప్టెంబర్‌ 17: రాజకీయ నాయకులు ప్రజలకు ఏదో ఒకటి చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంటారు. కొందరు వివాహాలు జరిపిస్తారు. మరి కొందరు బట్టలు పంఛి పెడతారు. కాని కైకలూరు MLA దూలం నాగేశ్వరరావు మాత్రం గత 23 యేళ్లుగా వినాయక చవితికి ఉచితంగా విగ్రహాలను పంచి పెడుతున్నారు. చిన్న చిన్నవి కాదు మండపాల్లో ఏర్పాటు చేసుకునే భారీ విగ్రహాలు కావటంతో ప్రతియేటా వీటికోసం కైకలూరు వచ్చే భక్తులు సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. సర్వవిఘ్నాలు తొలగాలని విఘ్నాదిపతైన ఆ గణేశుడికి తొలి పూజ చేస్తారు.. వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి పల్లెలో, ప్రతి వాడా వీధి సంబరాలు చేసుకుంటారు.

సాధారణంగా స్వచ్ఛంద సంస్థల వారు, హిందూ సంఘాలు వినాయక చవితికి ఉచితంగా మట్టి విగ్రహాలు పంచుతారు. దేశంలో అన్నిచోట్ల వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం వినాయక చవితి ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి తానే స్వయంగా భారీ వినాయక విగ్రహాల ఉచితంగా ఇచ్చారు. అయితే ఇక్కడ అయన ఎమ్మెల్యే కనుక విగ్రహాలు ఉచితంగా ఇచ్చాడు అనుకుంటే పొరపడినట్టే.. ఆయన ఎమ్మెల్యే కాక ముందు నుంచి ఎన్నో సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామo ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాలనే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన అభిమానులు అంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు…? ఆ నియోజకవర్గ ఎక్కడ ఉంది..? వినాయక విగ్రహాలు ఉచితంగా ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు…? ఇప్పుడు తెలుసుకుందాం.

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జరిగే వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి కావాల్సిన సైజుల్లో ఒక అడుగు విగ్రహం నుంచి 10 అడుగుల ఎత్తు వరకు వినాయక విగ్రహాలు తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేశారు. కైకలూరు నియోజకవర్గంలో 110 పంచాయతీలు ఉంటే ఇప్పటివరకు 270 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. అయితే ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఈ విధంగా పంపిణీ చేస్తున్నారని అనుకోవచ్చు. అలా అనుకుంటే మనం పొరపడినట్టే.. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు 1998లో మూడు విగ్రహాలతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కోవిడ్ సమయంలో రెండు సంవత్సరాలు తప్ప గత 23 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి వినాయక చవితికి ఉచితంగా విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు చేస్తున్నారు. పండుగకు నెలరోజుల ముందుగానే ప్రతి గ్రామం నుంచి ఏటా వినాయక ఉత్సవాలు నిర్వహించే కమిటీలు సభ్యులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తమకు కావాల్సిన విగ్రహ వివరాలు తెలియచేస్తారు.

ఇవి కూడా చదవండి

విగ్రహం ఎత్తు, ఎవరికి ఏ సైజుల్లో కావాలో వారి దగ్గర వివరాలు తీసుకుని ఆ తరువాత విగ్రహాలు ప్రత్యేకంగా తయారు చేయించి, పండుగకు రెండు రోజుల ముందు వాటిని పంపిణీ చేస్తారు. ఈ సంవత్సరం కూడా అలాగే ఎవరికి ఏ సైజు విగ్రహం కావాలో వారికి ఆ సైజు విగ్రహాలు పంపిణీ చేశారు. పంపిణీలో భాగంగా ముందుగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ట్రాక్టర్లు, వ్యాన్ల ద్వారా మేళ తాళాలతో ఊరేగించుకుంటూ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను తీసుకువెళ్లారు. ఈ విధంగా ప్రతి గ్రామంలో వినాయక చవితి వేడుకలు శోభాయమానంగా జరిగి ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలకు అన్ని విఘ్నాలు తొలగాలని, ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాల్లో చేరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనైనా పేదరిక నిర్మూలన చేయాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.