
అమరావతి, అక్టోబర్ 28: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్‌గా మారింది. గడిచిన 6 గంటల్లో 17 కి.మీ వేగంతో కదిలిన తుపాన్.. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 110 కిమీ, విశాఖపట్నంకి 220 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తీవ్రతుపాన్.. పూర్తిగా తీరం దాటడానికి మరో 3-4 గంటల సమయం పట్టనుంది. తీవ్ర తుపాన్‌గా మారిన మొంథా కాకినాడ సమీపంలో తీరం దాటునుంది. దీని ప్రభావంతో కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురగాలులు వీయనున్నాయి. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.
తీరందాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం చూపనుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యల్లో అధికారులకు సహకరించాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఇది ఉత్తర వాయవ్యంగా కదిలి.. ఈ రోజు రాత్రి లోపు కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని దాదాపు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో తాజాగా రాష్ట్ర ఇంటర్ బోర్డు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన
కాగా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో రహదారులపై ఆంక్షలు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి నిలుపుదల. ముందే సురక్షిత లే భై లో నిలుపుకోవాలి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దంటూ ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 12 గంటలలో మోంధా తుఫాను ఉత్తర, వాయువ్యదిశలో కదులుతూ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో ఇంచు మించు కాకినాడకు సమీపంలో ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.