Kuppam: వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలతో రణరంగంగా మారిన కుప్పం.. తీవ్ర ఉద్రిక్తత

|

Aug 25, 2022 | 12:15 PM

Kuppam: వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలతో కుప్పం రణరంగంగా మారింది. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ విగ్రహాల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అన్న క్యాంటీన్‌..

Kuppam: వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలతో రణరంగంగా మారిన కుప్పం.. తీవ్ర ఉద్రిక్తత
Follow us on

Kuppam: వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలతో కుప్పం రణరంగంగా మారింది. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ విగ్రహాల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అన్న క్యాంటీన్‌ దగ్గర ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేశారు. అక్కడున్న కార్యకర్తల మీదకు దూసుకెళ్లారు. మరోవైపు వైఎస్‌ఆర్‌ విగ్రహం దగ్గర ఉన్న ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర పెట్టిన టేబుళ్లను ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. ఈ ఘటనలతో కుప్పం సెంటర్‌లో హైటెన్షన్‌ నెలకొంది. వైసీపీ కార్యకర్తల తీరుకు నిరసనగా అన్న క్యాంటీన్‌ ఎదుట రోడ్డుపైనే బైటాయించారు చంద్రబాబు.

నిన్నటి నుంచి కుప్పంలో ఇదే ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటీలు పడి మరీ ఫ్లెక్సీలను చించేశారు. కుప్పంలోని మెయిన్‌ సెంటర్‌లో పక్కపక్కనే ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ విగ్రహాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గరే అన్న క్యాంటీన్‌ను పెట్టారు. దాన్ని చంద్రబాబు ప్రారంభించాల్సి ఉంది. అయితే టీడీపీ కార్యక్రమానికి పోటీగా వైసీపీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్‌ వైఎస్‌ఆర్‌ విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే కూర్చున్నారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి