కరోనా దేశవ్యాప్తంగా ఎంత కల్లోలం క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ వల్ల ఎంతోమంది ప్రాణాలు విడిచారు. పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతోమంది చిన్న పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ క్రమంలో అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షల బీమా చేసేందుకు ఏపీలోని జగన్ సర్కార్ నిర్ణయించింది. తాజాగా ఈ బీమా నిబంధనలను స్వల్పంగా సవరించారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో మార్పు చేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. “ఏదేని ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ.10లక్షల పరిహారం ఇవ్వాలి అనే నిబంధనను తొలగించారు. ఈ నిబంధన తొలగింపుతో అదనంగా మరికొంత మంది పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 18 ఏళ్లు దిగువన ఉండి.. కరోనా కారణంగా పేరెంట్స్‌ను కోల్పోయిన పిల్లలకు ఈ బీమా వర్తిస్తుంది. ఆ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతినెలా లబ్దిదారులకు అందించేలా ప్రభుత్వం కార్యచరణ రూపోందించింది.
Also Read: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట.. 60 ఏళ్లు వచ్చే వరకూ అర్హులే అంటూ హైకోర్టు తీర్పు