Andhra Pradesh: చిట్‌ఫండ్‌ కంపెనీల ఆగడాలకు ఏపీ ప్రభుత్వం చెక్‌.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు..

రాష్ట్రంలో చిట్‌ఫండ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ఆగడాలకు చెక్‌ పెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఫైనాన్స్‌ కంపెనీలపై రాష్ట్రవ్యాప్తంగా అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా తీవ్ర అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు....

Andhra Pradesh: చిట్‌ఫండ్‌ కంపెనీల ఆగడాలకు ఏపీ ప్రభుత్వం చెక్‌.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు..
Chit Fund Companies
Follow us

|

Updated on: Nov 15, 2022 | 7:59 PM

రాష్ట్రంలో చిట్‌ఫండ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ఆగడాలకు చెక్‌ పెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఫైనాన్స్‌ కంపెనీలపై రాష్ట్రవ్యాప్తంగా అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా తీవ్ర అక్రమాలు, ఉల్లంఘనలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ప్రజల కష్టార్జితాన్ని పరిరక్షించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత నెల అక్టోబరు 21న 12 చిట్‌ఫండ్‌ కంపెనీల్లో, అక్టోబరు 31న 5 చిట్‌ఫండ్‌ కంపెనీల్లో స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్స్‌ విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వెలుగుచూసిన అంశాల ఆధారంగా తప్పిదాలకు పాల్పడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో మొత్తం 18 చోట్ల సోదాలు జరిపారు. 2021-22 మధ్య చిట్స్‌ మొత్తాలను మళ్లించినట్టుగా అధికారులు గుర్తించారు. ముందస్తు పద్ధతిలో డబ్బులు వసూలు చేసినట్టుగా గుర్తించారు. బాధితుల నుంచి దీనికి 5 శాతం వడ్డీని వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. చిట్‌ఫండ్‌ చట్టంలో సెక్షన్‌ 31ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. పాటపాడుకున్న వ్యక్తి నుంచి సరిగ్గా సెక్యూరిటీ తీసుకోకపోవడం, కంపెనీలు కూడా సెక్యూరిటీ ఇవ్వట్లేదని అధికారులు తెలిపారు. ఇక ఆలస్యంగా చిట్టీలు కట్టినవారిపై వేసిన పెనాల్టీలకు జీఎస్టీ చెల్లించలేదని అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..