ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మళ్లీ తీవ్ర స్థాయికి చేరుతున్న సమరం

|

Apr 29, 2023 | 8:28 AM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సమరం మళ్లీ తీవ్ర స్థాయికి చేరేలా కనిపిస్తోంది. ఇప్పటికే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాంటూ నెత్తీ నోరు మొత్తుకున్న ఉద్యోగులు.. ఇక తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. ఆదివారం వరకు డెడ్ లైన్ పెట్టి.. తుది ఉద్యమ కార్యచరణపై ప్రకటన చేశారు.

ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మళ్లీ తీవ్ర స్థాయికి చేరుతున్న సమరం
Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సమరం మళ్లీ తీవ్ర స్థాయికి చేరేలా కనిపిస్తోంది. ఇప్పటికే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాంటూ నెత్తీ నోరు మొత్తుకున్న ఉద్యోగులు.. ఇక తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. ఆదివారం వరకు డెడ్ లైన్ పెట్టి.. తుది ఉద్యమ కార్యచరణపై ప్రకటన చేశారు. ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఇక సమస్య పరిష్కారం అయినట్లేనని చెబుతున్నా.. అవి కార్యరూపం దాల్చేవరకు వెనక్కి తగ్గేది లేదంటున్నాయి ఉద్యోగ సంఘాలు. తాజాగా ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో ఏపీ ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి..గత 50రోజులుగా ఉద్యమం చేస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు . ప్రభుత్వం నిన్నటి వరకు చర్చలు జరపకుండా చివరి నిమిషంలో పిలిచి అనధికారిక చర్చలన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదని.. డీఏ, సరెండర్ లీవ్‌లు ఎప్పుడు ఇస్తారో ఇంకా చెప్పలేదన్నారు. ఇవాళ్టి నుంచి గ్రామ, వార్డు సచివాలయ సమస్యలపై ధర్నా చేస్తున్నట్లు ప్రకటించిన బొప్పరాజు..ఈనెల 30న తుది కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఏపీ జేఏసీ అమరావతి సభ్య సంఘాలతో పాటు, ఉద్యోగ సంఘాలు, ట్రేడ్‌ యూనియన్ల రౌండ్‌టేబుల్‌ భేటీలో పాల్గొ్న్నారు. ఈ సమావేశానికి వచ్చిన పలు ఉద్యోగ సంఘాలు నేతలు సైతం అధికార ప్రభుత్వం.. ఉద్యోగుల పట్ల అనుకూలంగా లేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాలను విభజించు-పాలించు విధానాన్ని అవలంభిస్తోందని ఆరోపించారు. చివరికి అన్ని సంఘాలతో కలుపుకుని తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో పాటు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..