ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీతో పాటు బీటెక్, బీఎస్సీ, బీఫార్మసీ తదితర ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహించే అన్ని కాలేజీలు, యునివర్సిటీలను అక్టోబర్ 1వ తేదీ నుంచి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర తాజాగా 2021–22 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. కోవిడ్ దృష్ట్యా సరి, బేసి విధానంలో తరగతులను నిర్వహించాలని.. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
వారానికి 6 రోజులు తరగతులను నిర్వహించనున్నారు. ఏదైనా కారణం చేత ఒక రోజు క్లాస్ జరగకపోతే.. రెండో శనివారం/ఆదివారం/సెలవు రోజులో నిర్వహిస్తారు. అలాగే అన్ని కోర్సులకు 2022-23 విద్యా సంవత్సరం ఆగష్టు 9 నుంచి పునః ప్రారంభం కానుంది.