Sajjala on Covid 19: థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది..టీవీ 9 తో సజ్జల రామకృష్ణారెడ్డి

|

Aug 23, 2021 | 3:46 PM

కరోనా మహమ్మారి ఏ రూపంలో వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Sajjala on Covid 19: థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది..టీవీ 9 తో సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala Ramakrishna Reddy
Follow us on

Sajjala Ramakrishna Reddy: కరోనా మహమ్మారి ఏ రూపంలో వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో థర్డ్ వేవ్ పై ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సజ్జల వెల్లడించారు.ప్రభుత్వం పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారస్తున్నారు..

ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రభావం ఉన్నా.. దానికి తగిన ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖ చేస్తోంది. మరోవైపు రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేసేందుకు, మంత్రుల సబ్ కమిటీ పరిస్థితులపై పర్యవేక్షణ చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో.. బెడ్స్ ,ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అయినప్పటికీ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి.. కరోనాను అధిగమించామన్నారు. అలాగే, కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. అందరికీ వ్యాక్సిన్ వేయడం లో ఆంధ్రప్రదేశ్ సత్తా ఏమిటో దేశ ప్రజలందరికి తెలుసన్నారు. గ్రామ ,వార్డు సచివాలయాల స్థాయిలో ద్వారా బాగా కృషి జరిగింది. థర్డ్ వేవ్ పై ఏపీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నాము.. ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also… వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి: ఏపీ ముఖ్యమంత్రి

Taliban Challenges: తాలిబన్లకు ముందుంది ముసళ్ళ పండగ.. పరిపాలనలో ముష్కర మూకల ముందు పెను సవాళ్ళు.. ఇవేనా?