Coronavirus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుబుంబాలకు సాయం

|

Mar 17, 2021 | 10:05 PM

Andhra Pradesh journalists: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టులు సేవలందించిన విషయం తెలిసిందే. అవగాహన

Coronavirus: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుబుంబాలకు సాయం
andhra pradesh government
Follow us on

Andhra Pradesh journalists: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల సేవలను గుర్తించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టులు సేవలందించిన విషయం తెలిసిందే. అవగాహన కల్పించడంలో.. ప్రజలు కోవిడ్ బారిన పడకుండా నియంత్రించడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. ఈ క్రమంలో కొంతమంది జర్నలిస్టులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఐ అండ్ పీఆర్ మంత్రిత్వ శాఖ బుధవారం జీవోను విడుదల చేసింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5లక్షలను అందించనున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

 

Also Read: 

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. గత 24గంటల్లో 23 వేలకు పైగా కేసులు.. ఎంతమంది మరణించారంటే?

Rajasthan Crime : రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి మరణ శిక్ష