Ramzan: రంజాన్ పర్వదినం.. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు నిషేధం: ఏపీ ప్రభుత్వం

|

May 12, 2021 | 7:26 AM

Andhra Pradesh government: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం 20వేలకు పైగా కేసులు నమోదవున్నాయి. ఈ మేరకు

Ramzan: రంజాన్ పర్వదినం.. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు నిషేధం: ఏపీ ప్రభుత్వం
ramzan 2021
Follow us on

Andhra Pradesh government: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం 20వేలకు పైగా కేసులు నమోదవున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో కరోనా కేసుల పెరుగుతున్న దృష్ట్యా మసీదుల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రస్తుతం ఏపీలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉండటం వలన నమాజ్ సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్ధనలు పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత మేరకు ఎవరి ఇళ్లల్లో వారే ప్రార్ధనలు చేసుకోవాలని సూచించింది.

అయితే.. మసీదుల్లో ప్రార్ధన చేసే సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం వెల్లడించింది. అయితే మసీదుల్లో 50 మందికి మించకూడదంటూ పేర్కొంది. సామాజిక దూరం పాటించాలని సూచించింది. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు విడతలుగా ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. మాస్క్ లేని వారికి అనుమతించవద్దంటూ పేర్కొంది. మసీదుల్లో వద్ద సానిటైజర్‌లు ఉంచాలని.. లేని పక్షంలో సబ్భులతో చేతులు కడుక్కోవాలని పేర్కొంది. షేక్ హాండ్స్, ఆలింగనాలకు దూరంగా ఉండాలని తెలిపింది. వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ఇంటి వద్దే ప్రార్ధనలు చేసుకోవాలని సూచించింది. అన్ని మసీదుల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని వెల్లడించింది. నిబంధనలు అమలయ్యేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Also Read:

Cloudburst In Uttarakhand: ఉత్తరాఖండ్​లో విరిగిపడ్డ కొండచరియలు.. ఆకస్మిక వరదలతో ఇళ్లు, దుకాణాల ధ్వంసం..!

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి స్కీమ్‌ కింద డబ్బులు జమ.. ఎప్పటి నుంచి అంటే..!