Andhra Pradesh: ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు… నోటిఫికేషన్‌ జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

| Edited By: Shiva Prajapati

Apr 16, 2021 | 7:55 AM

Degree And PG Courses: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ....

Andhra Pradesh: ఏపీలో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులు ఖరారు... నోటిఫికేషన్‌ జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ
Andhra Pradesh
Follow us on

Degree And PG Courses: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఈ ఫీజు అమలు చేయాలని ఆదేశించింది. సైన్స్‌, ఆర్ట్స్‌ విభాగాలల్లోని పీజీ కోర్సులకు సైతం ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక ఫీజులోనే ట్యూషన్‌, అఫిలియేషన్‌, ఐడీ కార్డు, స్టడీ టూర్ ఫీజులు కలిసి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ హెచ్చరించింది.

కోర్సులు.. వాటి వార్షిక ఫీజుల వివరాలు

► మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ – రూ.27,000
► కెమిస్ట్రీ – రూ.33,000
► బయోటెక్నాలజీ – రూ.37,400
► కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ – రూ.24,200
► జెనెటిక్స్‌ – రూ.49,000
► ఎంఏ, ఎంకామ్‌ – రూ.15,000 నుంచి రూ.30,000

ఇవీ చదవండి: SBI Recruitment 2021: ఎస్‌బీఐలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ విడుదల.. ఖాళీల వివరాలు ఇవే..!

Reliance Jio: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియోలో భారీగా ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

త్వరలోనే టీఎస్​పీఎస్సీ పాలకవర్గం ఏర్పాటు..! సభ్యులుగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయంటే..?