Rare Sea Fish: మత్స్యకారుల వలకు చిక్కున అరుదైన సోఠారి చేప.. వేలం వేస్తే ఊహించని రీతిలో..

|

Oct 14, 2021 | 1:25 PM

AP Fishermen: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో మత్స్యకారుల వలకు అరదుదైన చేప చిక్కింది. 20 కేజీల భారీ తెరచేప మత్స్యకారులకు దొరకడంతో

Rare Sea Fish: మత్స్యకారుల వలకు చిక్కున అరుదైన సోఠారి చేప.. వేలం వేస్తే ఊహించని రీతిలో..
Fish
Follow us on

AP Fishermen: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో మత్స్యకారుల వలకు అరదుదైన చేప చిక్కింది. 20 కేజీల భారీ తెరచేప మత్స్యకారులకు దొరకడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. వారి వలకు భారీ సైజులో ఉన్న ‘తెరపార’ చేప చిక్కింది. సముద్రం నుంచి బయటకు వచ్చాక దానిని కొలత వేయగా.. 20 కేజీలు తూగింది. ఇది సొర చేప జాతికి చెందినదని, దీన్ని స్థానికంగా తెరపార లేదా సొఠారి అని పిలుస్తారు. ఈ చేపను వేలం నిర్వహించగా.. వేలలో ధర పలికింది. దాంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, భారీ సైజులో ఉన్న అరుదైన తెరపార చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు.

ఇదిలాఉంటే, సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు ఇలాంటి చేపలు చాలా అరుదుగా దొరుకుతాయని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలోనూ ఇలాంటి చేపలు దొరికాయన్నారు. అయితే, ఇంత భారీ సైజులో దొరకలేదని, అమ్మితే ఇన్ని డబ్బులు కూడా రాలేదని పేర్కొన్నారు. ఏదైమైనా మత్స్యకారులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో శ్రీకాకుళంలో అరుదైన శంఖం దొరికిన విషయం తెలిసిందే. దానిన వేలం వేయగా దానిని కూడా వేలలో ధర పలికింది.

Also read:

Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్‌కు దసరా బహుమతి.. భీమ్లా నాయక్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

Gold and Diamonds Mines: తెలంగాణలో పుష్కలంగా బంగారం, వజ్రాల నిక్షేపాలు.. సంచలన విషయాలు చెప్పిన శాస్త్రవేత్తలు!

Hema Comments: రాత్రి గెలిచాం.. ఉదయం ఓడిపోయాం.. ఏం జరిగిందో అమ్మవారికే తెలియాలన్న హేమ..