AC vs DC: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌పై ఏపీ సర్కార్ సీరియస్.. ఉద్యోగుల్లో అశాంతి రేపుతున్నారన్న ఆరోపణలపై నోటీసులు
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఉద్యోగుల్లో అశాంతి రేపుతున్నారన్న ఆరోపణలపై నోటీసులు ఇచ్చింది. వివాదాస్పద వ్యవహారాలు..
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఉద్యోగుల్లో అశాంతి రేపుతున్నారన్న ఆరోపణలపై నోటీసులు ఇచ్చింది. వివాదాస్పద వ్యవహారాలు, నిర్ణయాలపై ఈనెల 30లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని సూచించింది. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కె.శాంతి.. గ్రూప్ 1 అధికారిణి. ప్రస్తుతం ప్రొహిబిషన్ పిరియడ్‌లో ఉన్నారు. అయితే ఆమె వ్యవహరశైలి భరించలేకపోతున్నామంటూ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతకుముందు ఉన్నతాధికారిపై ఇసుక చల్లి వివాదానికి కేంద్ర బిందువయ్యారామె. ఆ తర్వాత ఆమె చర్యలు శాఖ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయనే ఆరోపణలు మిన్నంటాయి. రాజమండ్రి రీజనల్ జాయింట్ డైరెక్టర్ సురేష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ శాంతికి నోటీసులు పంపారు.
అసిస్టెంట్ కమిషనర్ శాంతి అశాంతి రేపుతోందంటూ గతంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆమెతో పనిచేయలేమంటూ భోరుమన్నారు.
ఉద్యోగులంతా మూకుమ్మడిగా సెలవు పెట్టడంతో ప్రభుత్వం శాంతిపై సీరియస్ అయింది. అయితే నోటీసులకు ఆమె ఎలాంటి వివరణ ఇస్తుందనేది చూడాలి.
ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..
Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజ్జాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం
SBI: దాచుకోవడమే కాదు.. సంపాదించడం కూడా తెలుసుకోండి.. ఎస్‌బీఐ అందించే అద్భతమైన డిపాజిట్ స్కీమ్..
Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..