AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్‌కు దసరా బహుమతి.. భీమ్లా నాయక్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

Bheemla Nayak Song: పవన్‌ కళ్యాణ్‌, రానాలు హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్‌'. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియమ్‌' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది...

Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్‌కు దసరా బహుమతి.. భీమ్లా నాయక్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..
Bheemla Nayak Song
Narender Vaitla
|

Updated on: Oct 14, 2021 | 1:15 PM

Share

Bheemla Nayak Song: పవన్‌ కళ్యాణ్‌, రానాలు హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. వకీల్‌ సాబ్‌ వంటి సూపర్ హిట్‌ తర్వాత పవన్‌ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తుండడం కూడా ఈ సినిమాపై హైప్‌ పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టైటిల్‌ సాంగ్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్‌ పుట్టిన రోజు కానుకగా విడదులైన ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది.

ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్‌ అభిమానులకు దసరా కానుకగా ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేయనుంది. దసరా కానుకగా అక్టోబర్‌ 15న ఉదయం 10.19 నిమిషాలకు ఈ సినిమాలోని ‘అంత ఇష్టం ఏందయ్యా నీకు నా మీనా’ అని సాగే పాటను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో గురువారం ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ పాటను పవన్‌, నిత్యామీనన్‌ల మధ్య తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో పవన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక థమన్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్‌ ఏకంగా రూ. 5.04 కోట్లకు కొనుగోలు చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్యర్య రాజేశ్‌ నటిస్తోందని మొదట్లో వార్తలు వచ్చినా.. తర్వాత మలయాళ నటి సంయుక్త మీనన్‌ నటిస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిత్ర యూనిట్‌ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: IND vs PAK: దాయాదుల మధ్య పోరుకు సమయం దగ్గరపడుతోంది.. పాక్‌ను టీజ్‌ చేస్తూ చేసిన మౌకా మౌకా యాడ్‌ను చూశారా?

Viral Photos: ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

Long Hair: ముంబైకి చెందిన ఆకాంక్ష జుట్టుకు వరల్డ్‌ రికార్డ్‌.. వీడియో

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?