YSRCP News: 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార వైసీపీ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. కేబినెట్‌లో సహచరులను మార్చిన సీఎం జగన్ ఇప్పుడు పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించబోతున్నారు. ముందు చెప్పినట్లే మాజీ మంత్రులను ముఖ్యమైన జిల్లాల్లో రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించబోతున్నారు. ఈ లిస్ట్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. తాజా మాజీ మంత్రుల్లో ఇద్దరికి, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఇద్దరికి జిల్లా బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరికి రెండు, మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించే అవకాశముంది.
ఇన్నాళ్లు ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి, రాయలసీమకు సజ్జల, ఉభయ గోదావరి జిల్లాకు వైవీ సుబ్బారెడ్డి ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. కృష్ణా, గుంటూరుకు మోపిదేవి వెంకట రమణ, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీ బాధ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇవి పూర్తిగా మారిపోనున్నాయి. కొత్త జిల్లాల వారీగా ఒక్కో నేతకు రెండు, మూడు జిల్లాలు చూసేలా బాధ్యతలు అప్పగించబోతున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించడం, నేతల్ని, ఎమ్మెల్యేల్ని సమన్వయం చేసుకోవడం, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా జనంలోకి తీసుకెళ్లడం వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించే వారికే రీజనల్ కోఆర్డినేటర్ పదవులు ఇవ్వబోతున్నారు.
ఇన్నాళ్లు ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డికి ఈసారి పార్టీ కేంద్ర ఆఫీస్ బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సజ్జలతోపాటు విజయసాయిరెడ్డి కూడా సెంట్రల్ ఆఫీస్‌లో పార్టీ వ్యవహారాలను చూస్తారనే సమాచారం ఉంది. మంత్రులుగా ఉన్న బొత్స, పెద్దిరెడ్డికి, మాజీ మంత్రులు కొడాలి నాని, బాలినేనికి పార్టీ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది.
ఉత్తరాంధ్రలో…
వైసీపీకి ఉత్తరాంధ్ర చాలా కీలకం. అందుకే మంత్రిగా ఉన్నా సరే శ్రీకాకుళం, విజయనగరం బాధ్యతలను బొత్సకు అప్పగిస్తున్నారని సమాచారం. ఇన్నాళ్లు ఇక్కడ విజయసాయిరెడ్డి ఆ బాధ్యతలు చూశారు. కీలకమైన విశాఖ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ఆ బాధ్యత ఎవరికి అప్పగించే అవకాశం ఉంది, బొత్సకు శ్రీకాకుళం, విజయనగరం బాధ్యతలు అప్పగించడం వల్ల ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయనే సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు.
రాయలసీమలో..
రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ గెలిచింది కేవలం మూడే సీట్లు. కుప్పం, హిందూపురం, ఉరవకొండల్లోనే గెలిచింది. మిగిలిన అన్ని చోట్లా వైసీపీనే విజయం సాధించింది. అలాంటి ఆ నాలుగు జిల్లాల్లో మంత్రి పెద్దిరెడ్డికి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తోంది వైసీపీ అధిష్టానం. గతంలో ఈ నాలుగు జిల్లాల బాధ్యతను సజ్జల చూసేవారు.
టీవీ9కి అందిన సమాచారం మేరకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం ఇలా ఉండే అవకాశం..
శ్రీకాకుళం, విజయనగరం – బొత్స సత్యనారాయణ
తూర్పుగోదావరి – వైవీ సుబ్బారెడ్డి
పశ్చిమ గోదావరి – మిధున్‌రెడ్డి
కృష్ణా, గుంటూరు – కొడాలి నాని
పల్నాడు జిల్లా – మోపిదేవి వెంకట రమణ
ప్రకాశం, నెల్లూరు – బాలినేని శ్రీనివాసరెడ్డి
చిత్తూరు, అనంతపురం – పెద్దిరెడ్డి
కడప, కర్నూలు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
కేంద్రం ఆఫీస్ – సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి
Also Read..
Acharya: భలే భలే బంజారా సాంగ్ వచ్చేసింది.. చిరంజీవి, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు అదుర్స్..
TSPSC: గ్రూప్స్ పోస్టులకి అప్లై చేస్తున్నారా.. ఇలా చేసేవారిపై కఠిన చర్యలు..!