Andhra Pradesh: వారి నాలుకలు కోయాలి.. మాజీ మంత్రి పరిటాల సునిత సంచలన కామెంట్స్..

|

Dec 13, 2021 | 7:20 AM

Andhra Pradesh: రాష్ట్రంలో వైసీపీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు సకోసేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రజలకు సూచించారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో

Andhra Pradesh: వారి నాలుకలు కోయాలి.. మాజీ మంత్రి పరిటాల సునిత సంచలన కామెంట్స్..
Paritala Sunitha
Follow us on

Andhra Pradesh: టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలే టార్గెట్‌గా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు కోసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు పరిటాల సునీత. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పలు గ్రామాలలో గౌరవ సభ- ప్రజా సమస్యల చర్చా వేదిక కార్యక్రమాల్లో సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వైసీపీ నేతలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు లాంటి గంభీరమైన వ్యక్తితోనే వీరు కన్నీరు పెట్టించారంటే.. వైసీపీ నేతలు అన్న మాటలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చూస్తే కూర్చోమని.. అవరసమైతే వారి నాలుకలు కోయాలని పిలుపునిచ్చారు.

మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపైనా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే సోదరులు రాప్తాడు నుంచి పెనుకొండ వరకు భూముల సెటిల్‌‌మంట్స్ చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. చెన్నేకొత్తపల్లిలోని ఒక డాబాలో, అనంతపురం రూరల్ లో ఒక కళ్యాణమండపంలో, రాప్తాడులోని ఒక తోటలోని గెస్ట్ హౌసుల్లో పంచాయతీలు జరుగుతున్నాయన్నారు. సామాన్యుల మధ్య భూతగాదాలు పెట్టి వారి డబ్బు గుంజడమే పని గా పెట్టుకున్నారని సునీత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన సోదరులపై దుష్ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటూ వైసీపీ నేతలను, ఎమ్మెల్యేను పరిటాల సునీత నిలదీశారు. ఇప్పుడు హైదరాబాద్ లో 5కోట్లతో ఒక ఇళ్లు, అనంతపురంలో ఒక ఇళ్లు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు.

Also read:

AP CM Jagan: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. అప్రమత్తమైన సర్కార్.. నేడు ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష..

Bigg Boss 5 telugu: హౌస్ నుంచి బయటకు వచ్చేసిన కాజల్.. మిగిలిన వారిగురించి ఏమన్నదంటే..!

IND vs SA: ఆయన లేకుండానే రోహిత్ సేన ఆసియా కప్ గెలిచింది: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కీలక వ్యాఖ్యలు