Andhra Pradesh: అనిల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం.. ఆయనతో కలిసేదే లేదంటూ..

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగనే.. విభేదాలను సద్దుమణిచి చేతులు కలిపినా రూప్ కుమార్ యాదవ్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ, ఆయనతో కలిసి పని చేసేదే లేదని తెగేసి చెప్పారు అనిల్.

Andhra Pradesh: అనిల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం.. ఆయనతో కలిసేదే లేదంటూ..
Anil Kumar Yadav

Updated on: May 14, 2023 | 9:19 PM

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి జగనే.. విభేదాలను సద్దుమణిచి చేతులు కలిపినా రూప్ కుమార్ యాదవ్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ, ఆయనతో కలిసి పని చేసేదే లేదని తెగేసి చెప్పారు అనిల్.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌ యాదవ్‌తో విభేదాలు ఉన్నాయి. గత కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. అయితే, అనిల్ కుమార్, రూప్ కుమార్.. ఇద్దరూ బంధువులే. వీరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఏకంగా సీఎం జగనే రంగంలోకి దిగారు. వీరిద్దరినీ ఒకటి చేసే ప్రయత్నం చేశారు. రెండు రోజుల క్రితం ఇద్దరినీ కలిపారు సీఎం జగన్. ఇద్దరి చేతులను కలిపి, విభేదాలు వదిలేయాలని సూచించారు. అప్పటి వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత సీన్ రివర్స్ అయ్యింది.

తాజాగా ఇదే అంశంపై మాట్లాడిన అనిల్ కుమార్.. ‘జగనన్న మాట దేవుడి మాటగా బావిస్తా..
ఒకవేళ ఆ రాముడి మాటలను హనుమంతుడు తప్పాల్సి వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.. కానీ, ఆ వ్యక్తితో మాత్రం కలవను..’ అని అనిల్ కుమార్ తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..