AP Politics – Roja: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న కామెంట్స్‌పై వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన కామెంట్స్‌కు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తుంగలో తొక్కారు.. మునిసిపల్ ఎన్నికల్లో మురుగు కాలువల్లో ముంచి ముంచి తీశారు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టారు.. అయినా వారికి సిగ్గు రాలేదు.’’ అంటూ టీడీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రోజా. కుప్పంలో లోకేష్ మాట్లాడిన మాటలు, సవాళ్లు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కుప్పంలోనూ చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసేందుకే ఇలాంటి సవాళ్లు విసురుతున్నారని వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు.. ఏనాడు కుప్పం ప్రజలకు అందుబాటులో లేరని దుయ్యబట్టారు. కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొడతారంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలనను చేరవేశారని ఎమ్మెల్యే రోజా కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ జగన్ రాకపోయినా వైసీపీని గెలిపిస్తున్నారని, ఆయనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని రోజా నిప్పులు చెరిగారు. అధికారులపై దాడులకు పాల్పడడం, ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచి దౌర్జన్యాలకు దిగి వైసీపీ చేస్తోందని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తండ్రి కొడుకులు ఎన్ని ఆటలు ఆడినా కుప్పం ఎన్నికల తర్వాత రాసుకోవడానికి చరిత్ర.. చూసుకోవడానికి భవిష్యత్తు లోకేష్, చంద్రబాబులకు ఉండదంటూ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు.
Also read:
AP vs TS Politics: తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు ఇది మంచిది కాదు.. మంత్రి వెల్లంపల్లి సంచలన కామెంట్స్..