Andhra Pradesh: భార్య కోసం భర్త సాహసం.. చంద్రగిరి ఠాణా ముందు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని సూసైడ్ అటెంప్ట్

| Edited By: Srilakshmi C

Nov 22, 2023 | 8:13 AM

చంద్రగిరి పీఎస్ ముందు ఓ వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. దీనంతటికీ కారణం ఆ వ్యక్తికి భార్య దూరం కావడమే. తన చెంతకు భార్య రాకుండా ఫ్యామిలీ మేటర్ లో కానిస్టేబుల్ జోక్యం చేసుకుంటున్నాడని పీఎస్ ముందే పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. కానిస్టేబుల్ బెదిరించాడంటూ మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తన భార్య విషయంలో కానిస్టేబుల్ జోక్యం వల్ల అన్యాయం జరిగిందని, దొంగతనం కేసుపెట్టి లోపలేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ..

Andhra Pradesh: భార్య కోసం భర్త సాహసం.. చంద్రగిరి ఠాణా ముందు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని సూసైడ్ అటెంప్ట్
Man Attempted Suicide By Pouring Petrol
Follow us on

చంద్రగిరి, నవంబర్‌ 22: చంద్రగిరి పీఎస్ ముందు ఓ వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. దీనంతటికీ కారణం ఆ వ్యక్తికి భార్య దూరం కావడమే. తన చెంతకు భార్య రాకుండా ఫ్యామిలీ మేటర్ లో కానిస్టేబుల్ జోక్యం చేసుకుంటున్నాడని పీఎస్ ముందే పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. కానిస్టేబుల్ బెదిరించాడంటూ మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తన భార్య విషయంలో కానిస్టేబుల్ జోక్యం వల్ల అన్యాయం జరిగిందని, దొంగతనం కేసుపెట్టి లోపలేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ ఆరోపిస్తున్న వ్యక్తి పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకోవడం చంద్రగిరి ఠాణా వద్ద కలకలం రేపింది.

విజయవాడకు చెందిన మణికంఠ, తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన దుర్గను 10 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల గాయత్రి, 5 ఏళ్ల అభయ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బతుకు దెరువుకోసం హైదరాబాద్ లో స్థిరపడ్డ మణికంఠ ను విభేదించిన భార్య దుర్గ తిరుపతికి వచ్చేసింది. భాకరాపేటకు చెందిన సోను అలియాస్ బాషాతో దుర్గకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి చంద్రగిరి పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పగడాల శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో ఆయనకున్న మామిడితోటకు కాపలాగా ఉంటూ అక్కడే మకాం పెట్టారు.

ఈ మధ్యనే దుర్గ భర్త మణికంఠ కు ఫోన్ చేసింది. మణికంఠ అంటే ఇష్టమని భాకరాపేటలో ఉన్నానంటూ ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఈ నెల 20న ఉదయం చంద్రగిరి చేరుకున్న మణికంఠ తన భార్యను ఇంటికి పంపించాలంటూ కానిస్టేబుల్ శ్రీనివాసులును కలిసాడు. ఇందుకు కానిస్టేబుల్ అంగీకరించక పోగా, చెప్పినట్లు వినకపోతే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తానంటూ బెదిరించాడని మనికంట ఆరోపిస్తున్న మణికంఠ మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేశాడు. పోలీసుస్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకు నుంచి క్యాన్ లో పెట్రోల్ నింపుకొని స్టేషన్ వద్ద శరీరంపై పోసుకొని నిప్పంటించు కున్నాడు.

ఇవి కూడా చదవండి

స్టేషన్ లోపలికి పరుగులు తీయడంతో వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ తీరును తప్పుపడుతూ న్యాయం చేయమంటూ కేకలు వేశాడు. మంటలు ఆర్పి మణికంఠను కాపాడే ప్రయత్నం చేసిన స్థానికులు, బాధితుడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలతో మణికంఠ మృత్యువుతో పోరాడుతుండగా భాకరాపేటలో భాషాతో సహజీవనం చేస్తున్న దుర్గను పోలీసులు భర్త దగ్గరకు చేర్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.