Andhra Pradesh: చిత్తూరులో ఇంటర్‌ విద్యార్ధిని దారుణ హత్య! కళ్లు పీకి.. జుట్టు కత్తిరించి…

|

Sep 26, 2023 | 7:53 AM

ప్రేమ పేరుతో మోసగించి ఇంటర్‌ విద్యార్ధినిని ముగ్గురు యువకులు దారుణంగా హత్య చేశారు. మాయ మాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లారు. అనంతరం కళ్లు పీకేసి, జుట్టు కత్తిరంచి అత్యాచారం చేసి బావిలో పడేశారు. మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహం బావిలో శవమై తేలింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా వేణుగోపాలపురంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

Andhra Pradesh: చిత్తూరులో ఇంటర్‌ విద్యార్ధిని దారుణ హత్య! కళ్లు పీకి.. జుట్టు కత్తిరించి...
Bhavya Sri Hair
Follow us on

చిత్తూరు, సెప్టెంబర్‌ 26: ప్రేమ పేరుతో మోసగించి ఇంటర్‌ విద్యార్ధినిని ముగ్గురు యువకులు దారుణంగా హత్య చేశారు. మాయ మాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లారు. అనంతరం కళ్లు పీకేసి, జుట్టు కత్తిరంచి అత్యాచారం చేసి బావిలో పడేశారు. మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహం బావిలో శవమై తేలింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా వేణుగోపాలపురంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మునికృష్ణ, పద్మావతి దంపతుల కుమార్తె. భవ్యశ్రీ స్థానిక పాఠశాలలో ఇంటర్‌ చదువుతోంది. సెప్టెంబర్‌ 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన భవ్యశ్రీ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఈ నెల 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరిగ్గా 3 రోజుల తర్వాత గ్రామ సమీపంలోని ఓ బావిలో మృతదేహమై కనిపించింది. భవ్యశ్రీని ప్రేమ పేరుతో ముగ్గురు యువకులు వేధించేవారని, వారే తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి హత్య చేశారని ఆరోపించారు. వినాయక నిమజ్జనం కోసం గ్రామస్థులు కొందరు ఈ నెల 20వ తేదీన బావి వద్దకు వెళ్లగా మృతదేహం కనిపించడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. మృతురాలి శరీరంపై ధరించి ఉన్న ఆభరణాలు, దుస్తులను చూసి మునికృష్ణ, పద్మావతి తమ కుమార్తెను గుర్తించారు. భవ్యశ్రీ మృతదేహం దారుణ స్థితిలో కనిపించింది. కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి గుర్తుపట్టలేనంతగా వేధించి హతమార్చారు. తమ కూతురిని దారుణంగా వేధించి హతమార్చారని కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. కూతురు అదృశ్యంపై 18నే పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Bhavya Sri

పోలీసుల వాదన మరోలా..

ఎస్సై అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. భవ్యశ్రీ మృతి విషయంలో ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించాం. అనుమానితులను పిలిపించి విచారించాం. వారి ఫోన్లలో కాల్‌డేటాను కూడా పరిశీలించాం. అనుమానాస్పదంగా ఏ ఆధారాలు అభ్యం కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారని మీడియాకు తెలిపారు. మరోవైపు.. తమకు పోలీసులపై నమ్మకం లేదని, శవ పరీక్ష నివేదికలనూ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. తమ బిడ్డ తలపై జుట్టు ఏమైందని తల్లిదండ్రులు ఎస్సై అనిల్‌ కుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బావిలోని నీటిని మోటారు ద్వారా తోడించగా జట్టు లభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.