Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: జైల్లో చంద్రుడు హ్యాపీగా ఉన్నారు.. చంద్రబాబు అరెస్టుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అనంతరం పరిస్థితులన్నీ మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. స్కిల్‌ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీటీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంశంపై మజ్లిస్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు

Asaduddin Owaisi: జైల్లో చంద్రుడు హ్యాపీగా ఉన్నారు.. చంద్రబాబు అరెస్టుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..
Asaduddin Owaisi On Chandrabau Arrest
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Ravi Kiran

Updated on: Sep 26, 2023 | 12:59 PM

Asaduddin Owaisi on Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అనంతరం పరిస్థితులన్నీ మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. స్కిల్‌ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీటీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంశంపై మజ్లిస్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని జైల్లో చంద్రుడు చాలా హ్యాపీగా ఉన్నారని, ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రెండే పార్టీలు ఉన్నాయని, ఒకటి టీడీపీ అయితే రెండోది జగన్‌ పార్టీ వైసీపీ అని చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని, ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడూ నమ్మొద్దంటూ మజ్లీస్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ కోరారు. అక్కడ ఎన్నికల్లో పోటీ విషయంపైనా అసదుద్దీన్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మజ్లిస్‌ కార్యకర్తలతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో అసదుద్దీన్‌ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసదుద్దీన్‌ వార్నింగ్‌

నిన్నటి వరకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పొగిడిన ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ.. ఒక్కసారిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఫైర్‌ అయ్యారు. మజ్లిస్‌ పార్టీ కార్యకర్తలు, తమ నేతలను వేధిస్తున్న ఎమ్మెల్యేలను కచ్చితంగా గుర్తుపెట్టుకుంటామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. తమతో స్నేహపూర్వకంగా ఉంటే తామూ చేయందిస్తామని, కానీ ఫ్రెండ్‌షిప్‌ పేరుతో వెన్నుపోటు పొడిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని అసద్‌ స్పష్టం చేశారు. మాతోనే మీకు అవసరం ఉంటుంది తప్ప.. మాకు మీతో ఎలాంటి అవసరాలు లేవని, రావని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఏ పార్టీనైనా ఎదుర్కొంటున్నామని, సమస్యలపై పోరాడుతున్నామన్న అసదుద్దీన్‌.. పదవులపై తమకు ఎలాంటి ఆశలు లేవని, కేవలం పేద ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఎప్పటికీ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఇటీవల అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ నిర్ణయాన్ని ప్రకటించడంతోపాటు పలు కీలక అంశాలపై ప్రసంగించారు. బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చెయ్యాలని పార్టీ సభ్యులకు కార్యకర్తలకు, ఓటర్లకు స్పష్టం చేశారు. తెలంగాణలో 9 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పరిపాలన నడుస్తుందని, ఎలాంటి మతకలహాలకు చోటు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ ప్రశంసించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..