AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. 24 గంటల్లో 20 వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..

|

May 11, 2021 | 6:48 PM

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి భీకరంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. 24 గంటల్లో 20 వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..
Corona Virus
Follow us on

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి భీకరంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 86,878 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా.. వారిలో 20,345 మందికి పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,20,039 మంది కరోనా బారిన పడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 108 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 14,502 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,95,102 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 11,18,933 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,899 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా నమోదైన కేసుల్లో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426 మంది కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నంలో 2,371 మంది పాజిటివ్ అని తేలింది. అనంతపురం-1991, తూర్పు గోదావరి-1,527, గుంటూరు-1919, కడప-1,902, కృష్ణా-948, కర్నూలు-797, నెల్లూరు-1,673, ప్రకాశం-1,130, శ్రీకాకుళం-1,457, విజయనగరం-744, పశ్చిమ గోదావరి-1,549 చొప్పున జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి.

Also read:

Corona Fear: కరోనా మహమ్మారితో మరో భయం..మానసికంగా నలిగిపోతున్న ప్రజలు..ఆందోళనతో అనారోగ్యం!

Mohanlal: ఆరు ప‌దుల వ‌య‌సులోనూ మోహ‌న్ లాల్ క్రేజీ వ‌ర్క‌వుట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Corona Pandemic: అల్లకల్లోలంలోనూ కరోనా సోకని గ్రామం..అక్కడ టెస్ట్ లు నిల్..వ్యాక్సిన్ ఫుల్..ఎక్కడ ఉందో తెలుసా?