CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం జగన్ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1.55 కు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్ధ పార్లే ఫర్ ది ఓషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. అక్కడ సీఎం జగన సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య బీచ్ పర్యవేక్షణపై ఎంవోయూ జరగనుంది.
దాదాపు 20 వేల మందితో 28 కిలోమీటర్ల వరకు బీచ్ శుభ్రం చేయడం కార్యక్రమం జరుగనుంది. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్ధ శిక్షణ ఇచ్చిన 5 వేల మందికి ధృవపత్రాలను అందించనున్న ముఖ్యమంత్రి జగన్. అయితే విశాఖ నుంచి భీమిలి వరకు న్న 28 కిలోమీటర్ల తీరాన్ని స్వచ్ఛంద సంస్థలతో పరిశుబ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి