Andhra Pradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి హెలీప్యాడ్ నుండి తణుకు బయలు దేరుతారు ముఖ్యమంత్రి జగన్. అక్కడి నుంచి 11 గంటలకు తణుకు చేరుకుంటారు. అక్కటి నుంచి 11.20 నిమిషాలకు సభాప్రాంగణానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకోనున్నారు. అక్కడి పబ్లిక్ మీటింగ్‌లో 11.20 నిమిషాల నుండి12.50 నిమిషాల వరకు సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభిస్తారు. ఆ సభా వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇక 1.10 నిమిషాలకు తిరిగి అమరావతికి బయలుదేరుతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఇదిలాఉంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. దీంతో సీఎం జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలు మొదలు సామాన్య ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, సీఎం పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినూత్న రీతిలో శుభాకాంక్షలను చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోని గోశాల ముందు ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ తో సీఎం జగన్ ముఖచిత్రం ఏర్పాటు చేయించారు. వంద అడుగుల పొడవు, వెడల్పు తో 2d ఆర్కిటెక్చర్ టెక్నాలజీ తో సీఎం జగన్ ముఖచిత్రాన్ని రూపొందించారు.
Also read: