AP CM YS Jagan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణ పద్ధతులు.. యాభై శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లకేః సీఎం జగన్

రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్యం అందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వాసుపత్రికి వచ్చేలా వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలన్నారు.

AP CM YS Jagan: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణ పద్ధతులు.. యాభై శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ పేషెంట్లకేః సీఎం జగన్
Ap Ys Jagan
Follow us

|

Updated on: Sep 14, 2021 | 5:02 PM

AP CM YS Jagan Medical Review: రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అత్యాధునిక వైద్యం అందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వాసుపత్రికి వచ్చేలా వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ వైద్య, ఆరోగ్య శాఖపై మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య శాఖ ఉన్నతాధికారులకు పలు కీలక సూచనలు చేశారు. హెల్త్‌హబ్స్‌ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. అదే విధంగా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్‌ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని)తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హెల్త్‌హబ్స్‌ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్‌హబ్స్‌ ద్వారా నెరవేరుతుందన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలని తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్‌ హబ్స్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇస్తామని సీఎం తెలిపారు.

అలాగే, రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల పనితీరుపై సీఎం ఆరా తీశారు. వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను సీఎంకు అధికారులు వివరించారు. ఆస్పత్రుల నిర్వహణకోసం ప్రత్యేక అధికారుల నియమిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్‌ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసులు, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను అధికారులు నిర్వహించనున్నారు. సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ తెలిపారు. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని సీఎం ఆదేశించారు. అలాగే వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్‌ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమని తెలిపారు. అలాగే రిసెప్షన్‌ సేవలు కూడా కీలకమన్న సీఎం.. రోగులకు సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయన్నారు. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెట్టాలన్న సీఎం.. ఎవరు ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణస్థాయి బలోపేతంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

రిసెప్షన్‌ సేవలు కూడా కీలకమని తెలిపారు. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయని పేర్కొన్నారు. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెట్టాలని, ఎవరు ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సూచించారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలోపేతంగా ఉండాలని, నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు సంబంధించిన వివరాలు  ► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు ► నవంబర్‌ 15 నుంచి 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు ► వచ్చే జనవరి 26 నుంచి పూర్తి స్ధాయిలో అమలు ► జనాభానుకూడా దృష్టిలో ఉంచుకుని ఆమేరకు 104 లను వినియోగించాలని సీఎం ఆదేశం ► అలాగే విలేజ్‌ క్లినిక్స్‌ విధివిధానాలను, ఎస్‌ఓపీలను ఖరారుచేయాలన్న సీఎం ► పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలని, ఒక డాక్టరు పీహెచ్‌సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో సేవలు అందించాలి ► కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ చర్యలు ► ఏపీలో మొత్తం యాక్టివ్‌ కేసులు 14,652 ► పాజిటివిటీ రేటు 2.23 శాతం ► రికవరీ రేటు 98.60 శాతం ► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు 2699 ► కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 854 ► నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 91.66 శాతం ► ప్రైవైటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ 71.04 శాతం ► 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌ 753 ► ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 ఫీవర్‌ సర్వేలు పూర్తయ్యాయి ► రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు 10,541 ► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువ నమోదైన జిల్లాలు 9 ► పాటిజివిటీ రేటు 3శాతం కంటే ఎక్కువున్న జిల్లాలు 4

థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ డీ టైప్‌ సిలెండర్లు 27,311 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు 20,964 ► ఇంకా రావాల్సినవి 2493 ► 50 అంతకంటే ఎక్కువ బెడ్స్‌ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ► 11 అక్టోబరు నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానున్న పీఎస్‌ఏ ప్లాంట్లు

వ్యాక్సినేషన్‌ ► ఇప్పటివరకు సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 1,33,30,206 ► రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 1,08,54,556 ► ► మొత్తం వ్యాక్సినేషన్‌ (సింగిల్, డబుల్‌ డోసు కలిపి) పూర్తైన వారు 2,41,84,762 వ్యాక్సినేషన్‌ కోసం వినియోగించిన మొత్తం డోసులు 3,50,39,318

Read Also…  Minister Malla Reddy: తప్పకుండా వాడ్ని ఎన్‌కౌంటర్ చేసి పారేస్తాం.. మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన

Ganesh Immersion: వినాయక విగ్రహాల నిమజ్జనంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో