AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ‘మై డియర్ సీఎం.. మీ మేలు మరవం’.. తిరుమలకు పాదయాత్ర.. రీజన్ ఇదే

సాయం అంటే చాలు ఎగబడి వచ్చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. పేదవర్గాలకు ఇంటి పెద్దగా నేనుంటానంటూ భరోసా ఇస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి పాప ప్రాణం నిలిపేందుకు కోటి రూపాయలు శాక్షన్ చేశారు.

CM Jagan: 'మై డియర్ సీఎం.. మీ మేలు మరవం'..  తిరుమలకు పాదయాత్ర.. రీజన్ ఇదే
Kid Father Padayatra To Tirumala To Say Thanks TO CM Jagan
Ram Naramaneni
|

Updated on: Nov 23, 2022 | 2:45 PM

Share

థాంక్యూ సీఎం సార్.. అంటూ.. వీరు చేస్తున్న ఈ పాదయాత్ర ఎక్కడికో తెలుసా? ఎందుకో తెలుసా? తమ చిన్నారి కష్టాన్ని గుర్తించి.. దాన్ని పూర్తిగా తొలగించిన సీఎం జగన్ కి కృతజ్ఞత చెబుతూ.. తిరుమల వెంకన్న కు మొక్కులు తీర్చుకోడానికి వెళ్తున్న ఇతని పేరు కొప్పాడి రాంబాబు. ఇతడి వెంట నడుస్తున్న అతని పేరు ప్రసాద్. చిన్నారి హనీ మేనమామ. ఇప్పుడు చిన్నారిని ఆరోగ్యం కుదుటపడింది. చాలా  ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకుంటుంది.  ఇందుకు కారణం.. ఆనాడు సీఎం జగన్ చేసిన గొప్పసాయంగా చెబుతారు ఈ కుటుంబ సభ్యులు. వీరిపుడు 17 రోజులుగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పాదయాత్రగా.. 700 కిలోమీటర్లు ప్రయాణించి.. ప్రస్తుతం తిరుమలకు వెళ్లే దారిలో ఉన్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, నక్కా రామేశ్వరానికి చెందిన హనీ అనే చిన్నారికి.. కాలేయానికి సంబంధించిన అరుదైన గాకర్స్ బారీన పడింది. తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి నిరుపేదలు. తండ్రి ఇంటంటా ప్రభుత్వ రేషన్ వాహనాన్ని నడుపుతుండగా.. తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల.. హనీ ఉన్నారు. హనీకి 15 రోజులకు ఒక సారి లక్షా 25 వేల రూపాయల విలువైన సెరిజైమ్ అనే ఇంజెక్షన్ చేయాల్సి ఉంది. అమెరికాలోని ఈ ఇంజెక్షన్ తయారీకి డిస్కౌంట్ పోను.. 74 వేల రూపాయలు కావాలి. ఇంత ఖర్చు చేయడం ఆ కుంటుంబానికి వీలు కాని పని.

తమ కుమార్తెను ఎలా దక్కించుకోవాలో తెలియని దిక్కు తోచని స్తితిలో ఉన్న వారికి ఏపీ సీఎం జగన్ ఆదుకున్నారు. గత జూలై 26న జగన్ కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చారు. లంకల్లో వరద పరిస్థితులను పరిశీలించాక.. పెదపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు కాన్వాయ్ లో వెళ్తున్నారు. ఇంతలో సీఎంగారూ మా పాపకు వైద్యం అదించండీ అంటూ ఒక ప్లకార్డును పట్టుకుని కనిఇంచారు. ఈ ప్లకార్డు ఊసిన ఏపీ సీఎం జగన్.. ఆ చిన్నారి వ్యాధి గురించి విని చలించి పయారు. పాప ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎత ఖర్చు అయినా వైద్యం చేయిస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు చిన్నారి వైద్యానికి తొలి విడతగా పది లక్షల విలువైన 13 ఇంజెక్షన్లు తెప్పించారు. తర్వాత నలభై లక్షలతో మరో 52 లక్షల ఇంజెక్షన్లు కూడా తెప్పించి ఆమెకు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తల్లిదండ్రులు ఆనాడు ఎంతగానో చలించి పోయారు. మా పాపకు ప్రాణదానం చేసిన సీఎం జగన్ ఎంతగానో రుణపడి ఉంటామని అన్నారు.. ఆ రోజు కాన్వాయ్ లో సీఎం జగన్ మమ్మల్ని చూసి ఆగడం.. కలెక్టర్ కు చెప్పడం లక్షలాది రూపాయల విలువైన వైద్యం అందించడం చూస్తుంటే.. ఒక సీఎం పేద వారి కోసం ఇంతగా పరితపిస్తారా? అని ఆశ్చర్యమేస్తోంది. మా మిడ్డను ఆదుకుని మా పాలిట దైవంలా నిలిచిన జగనన్నకు చేతులెక్కి దండాలు పెడుతున్నామని భావోద్వేగానికి లోనయ్యారు.

పాప ప్రస్తుతం వ్యాధి నయమయ్యి ఉల్లాసంగా ఉండటంతో.. తండ్రి, మేనమామ మొక్కు తీర్చుకోవడంలో భాగంగా తిరుమలకు చేరుకున్నారు. అంతే కాదు.. థాంక్యూ సీఎం సార్ అంటూ టీషర్టులకు ముద్రించుకుని.. తమ కృతజ్ఞత చాటుకుంటున్నారు. కనిపించని దైవం ఆ వెంకన్న కాగా.. కనిపించే దైవం ఈ జగనన్న అంటూ మొక్కు తీర్చుకుంటున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..