ఆరోగ్యమే మహా భాగ్యం.. రాష్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడమే తమ లక్ష్యమని చెప్పారు సీఎం జగన్. గడప గడపను జల్లెడ పట్టి.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. 45రోజుల పాటు నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు సీఎం. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సరికొత్త కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం రూపకల్పన చేసింది. మొన్న జరిగిన పార్టీ విసృత స్థాయి సమావేశంలోను ఇక నుంచి ప్రజలతోనే మమేకమయ్యేలా ప్లాన్ చేసుకోవాలని.. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు జగన్. ఈమేరకు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టారు సీఎం జగన్.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సురక్ష ప్రొగ్రాంను ప్రారంభించారు జగన్. 45 రోజుల పాటు నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌లో గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ భాగస్వాములేనని చెప్పారు. డోర్ టూ డోర్ .. విలేజ్ టూ విలేజ్ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని.. వారి సమస్యలు తీరే వరకూ తోడుగా ఉండాలని సూచించారు సీఎం జగన్.
స్పెషలిస్ట్ డాక్టర్ల చేత టెస్ట్ తర్వాత అవసరమైతే ఉచితంగా చికిత్స, మందులు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని చెప్పారు సీఎం. ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే ఇంకో డాక్టర్ అంబులెన్స్‌లో గ్రామాల్లోకి వెళ్తారని సీఎం తెలిపారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ ఐదు దశల్లో జరగనుంది. మొదటి దశ ఇప్పటికే సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రొగ్రాంలో ఇప్పటికే ఇంటికి వెళ్లి బీపీ, షుగర్‌తో పాటు పలు రకాల టెస్ట్‌లు చేశారు. అవసరమైన వారికి చికిత్స కూడా అందించారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవడంపై అవగాహన కల్పించనున్నారు. ఎక్కడ చికిత్స అందుతుంది? ఎలా వెళ్లాలి? ఎవర్ని సంప్రదించాలి? అన్న వివరాలతో కూడా బ్రోచర్‌ను అందించనున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల రక్తహీనత పై ప్రత్యేక దృష్టిసారించనున్నారు. దీర్ఘకాల వ్యాధులున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు సురక్ష క్యాంపెయిన్‌లో తీసుకోనుంది ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..