CM Jagan: వైసీపీ పాలనలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం.. సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తున్నాం.. సీఎం జగన్

|

Aug 15, 2022 | 1:35 PM

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ (CM Jagan) రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ చేరవేశామని వెల్లడించారు. విజయవాడలోని...

CM Jagan: వైసీపీ పాలనలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం.. సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తున్నాం.. సీఎం జగన్
Cm Jagan
Follow us on

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ (CM Jagan) రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ చేరవేశామని వెల్లడించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండా మనందరి స్వాతంత్య్రానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారుర. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనగా జరిగిన శాంతియుత పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య.. కోట్లాది మందికి గర్వకారణమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 75 ఏళ్ల కాలంలో దేశం ఎన్నో తిరుగులేని విజయాలు సాధించిందని, వ్వయసాయ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఆహారధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశామని చెప్పారు. 150 దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేయగలిగే స్థాయికి చేరుకోగలిగామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయాలను ఇంటింటికీ చేరువ చేశామని సీఎం జగన్ చెప్పారు.

ఇంటింటికీ పింఛన్లు అందిస్తున్నాం. ప్రతి మండలానికి పీహెచ్‌సీలు ఏర్పాటు చేశాం. వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ఆర్బీకేలు నిర్మించాం. జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి పరిపాలన వికేంద్రీకరణలో కొత్త అధ్యాయాన్ని లిఖించాం. రైతన్నకు అండగా వైఎస్సార్‌ రైతు భరోసా తీసుకొచ్చాం. రాష్ట్రంలోని 52 లక్షల రైతన్నల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నాం. సొంత ఇంటి కోసం అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే చాలా మందికి మహిళల పేరుతో ఇళ్లపట్టాలు అందజేశాం. చదువుతోనే సమగ్రాభివృద్ధి జరుగుతుందనే లక్ష్యంతో విద్యాకానుక తీసుకువచ్చాం. విద్యార్థుల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్ లో ఆంగ్ల ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాం. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ క్లినిక్‌లు ఏర్పాటవుతున్నాయి. మహిళలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నాం. వారు రాజకీయంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మహిళా, దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేసి వారికి భద్రత కల్పిస్తున్నాం.

      – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

కులం, మతం, వర్గం, ప్రాంత బేధాలు చూడకుండా అర్హులైన అందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అర్హులందరి ఖాతాల్లో నగదు జమ చేశామని వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలుచేశామని స్పష్టం చేశారు.