CM Jagan: వారికి గుడ్ న్యూస్.. మరికాసేపట్లో రాజహేంద్రవరానికి సీఎం జగన్.. ఆ లబ్ధిదారులతో ముఖాముఖి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇవాళ (మంగళవారం) రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం...

CM Jagan: వారికి గుడ్ న్యూస్.. మరికాసేపట్లో రాజహేంద్రవరానికి సీఎం జగన్.. ఆ లబ్ధిదారులతో ముఖాముఖి..
CM Jagan

Updated on: Jan 03, 2023 | 7:35 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇవాళ (మంగళవారం) రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.40 కు తాడేపల్లి చేరుకుంటారు. పెంచిన పింఛను రూ.250 కలిపి.. రూ.2,750 మొత్తాన్ని లబ్ధిదారులకు అందించే క్రమంలో ఇక్కడి బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక నాయకులు జన సమీకరణపై దృష్టి సారించారు.

సీఎం రోడ్‌షో ఉదయం 11.10 గంటలకు మున్సిపల్‌ స్టేడియం నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు సాగనుంది. ఈ మార్గాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మరమ్మతులు, ఇతర పనుల పేరుతో రెండు రోజులుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభాస్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. నమూనా చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అధికారులందరూ సమన్వయంలో పనిచేసి సీఎం జగన్‌ రాజమహేంద్రవరం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..