CM Jagan: ఆ ముఠా పని దోచుకో.. పంచుకో.. తినుకో.. దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు.. సీఎం స్ట్రాంగ్ కామెంట్స్..

|

Feb 28, 2023 | 3:44 PM

తెనాలి వేదికగా ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడికి 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా అని ప్రశ్నించారు. ప్రజలకు..

CM Jagan: ఆ ముఠా పని దోచుకో.. పంచుకో.. తినుకో.. దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు.. సీఎం స్ట్రాంగ్ కామెంట్స్..
Ap Cm Jagan
Follow us on

తెనాలి వేదికగా ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడికి 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యముందా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. తమది పేదల ప్రభుత్వమైతే చంద్రబాబుది పెత్తందారీ పార్టీ అని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.5 శాతం హామీలను అమలు చేశామని సీఎం జగన్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కరవుతో ఫ్రెండ్‌షిప్‌ ఉన్న చంద్రబాబు, వరుణ దేవుడి ఆశీస్సులున్న మనందరి ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగనుందని ఎద్దేవా చేశారు. మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఆ వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడు కాదు అనే పరిస్థితి రావాలన్నారు. మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండాలని మాత్రమే కోరుతున్నా అని సీఎం జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.54వేల చొప్పున సాయం అందించాం. వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటారు. రైతుల బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఎక్కడా కరవు అనే మాటే లేదు. చంద్రబాబు పాలనలో ఏటా కరవే ఉంది. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షానికి కడుపు మంటగా ఉంది. ఇచ్చిన హామీలు అన్ని నెరవేస్తున్నాం. మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా ఉండండి.

       – వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

వచ్చే ఎన్నికల్లో ఇంగ్లీష్‌ మీడియం వద్ద చంద్రబాబుకు మీ బిడ్డకు యుద్ధం జరగబోతోంది. రాష్ట్రంలో గజ దొంగల ముఠా ఉంది. ఈ ముఠా పని దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గజదొంగల ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడు. దుష్టచతుష్టాయానికి తోడు దత్తపుత్రుడు జతకలిశాడని ముఖ్యమంత్రి జగన్ శ్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. మీ బిడ్డ పాలనకు.. చంద్రబాబు పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..