Somu Veerraju: ‘ఈ రంగులేంటీ.. ఈ లోకమేంటి..’ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్

|

Oct 01, 2021 | 11:57 AM

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్ వాహనాలపై వైసీపీ రంగులు వేశారంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చెత్త సేకరణ

Somu Veerraju: ఈ రంగులేంటీ.. ఈ లోకమేంటి.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్
Somu
Follow us on

AP BJP Chief Somu Veerraju: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్ వాహనాలపై వైసీపీ రంగులు వేశారంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చెత్త సేకరణ వాహనాలను పరిశీలించిన సోము వీర్రాజు.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన వాహనాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేరు, వైసీపీ రంగులు ఎలా వేస్తారంటూ నిలదీశారు. కేంద్రం పెద్దఎత్తున నిధులు ఇస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం జరగడం లేదన్నారు సోము వీర్రాజు. కేవలం తిట్ల దండకంతోనే పాలన సరిపెడుతున్నారంటూ ఆరోపించారు. స్వచ్ఛ భారత్ నిధులతోనే జగన్ సర్కార్ క్లాప్ కార్యక్రమం చేపట్టిందన్న సోము వీర్రాజు.. చెత్త సేకరణ వాహనాలపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటో ఎందుకు పెట్టరంటూ ప్రశ్నించారు.

ఇదిలాఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న కలిసిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నేతలూ సమావేశమయ్యారు. బద్వేలు ఉపఎన్నిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అక్టోబర్ 2న శ్రమదానం వివరాలను జనసేన నేతలు ఈ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు వివరించారు. అక్టోబర్ 7న నెల్లూరులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మత్స్య గర్జన సభ వివరాలను బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్‌, మధుకర్‌లు కూడా పాల్గొన్నారు.

ఉప ఎన్నికల్లో పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా సోము – పవన్ చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు సోము వీర్రాజు. తాము కచ్చితంగా బద్వేలు ఉప ఎన్నికల బరిలో నిలుస్తామని.. అయితే ఏ పార్టీ నుండి అభ్యర్థి బరిలో నిలుస్తారన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సోము స్పష్టం చేశారు.

Read also: Billionaires Wealth: కరోనా అనేక రంగాల్ని సంక్షోభంలోకి నెట్టినాకాని.. దేశంలో భారీగా పెరుగుతోన్న కుబేరుల సంపద