AP News: ఒడిస్సా టు విజయనగరం…! వాళ్ళ ఐడియా మామూలుగా లేదు మరి…!

పాడేరు మండలంలోని చింతలవీధి జంక్షన్ వద్ద ఎస్ఈబీ, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఒడిస్సా నుంచి గంజాయి అల్లూరి జిల్లా మీదుగా వెళ్ళిపోతున్నట్టు సమాచారంతో.. నిఘా పెంచారు. చింతల వీధి జంక్షన్ లో కాపు కాసారు. ఒక్కో వాహనం తనిఖి చేస్తున్నారు అధికారులు, సిబ్బంది.

AP News: ఒడిస్సా టు విజయనగరం...! వాళ్ళ ఐడియా మామూలుగా లేదు మరి...!
Vehicle

Edited By:

Updated on: Feb 14, 2024 | 1:27 PM

పాడేరు, ఫిబ్రవరి 14:  ఏజెన్సీ నుంచి గంజాయి వ్యవహారాలను పూర్తిగా కట్టడి చేసేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు శ్రమిస్తున్నాయి.. గత కొంతకాలంగా దాదాపుగా స్మగ్లింగ్ అదుపులోకి వచ్చేసింది. స్మగ్లర్లు కూడా కటకటాల పాలవుతున్నారు. అయితే.. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్ వర్గాల కళ్ళు కప్పేందుకు సరికొత్త ఐడియాలకు శ్రీకారం చుడుతున్నారు స్మగ్లర్లు. తనిఖీ సిబ్బందిని ఏమార్చి.. గంజాయి తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా.. ఓ ఘటన అధికార వర్గాలకే అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే తనిఖీలు చేస్తుండగా ఓ వాహనం స్పీడుగా దూసుకెళ్లింది. అనుమానం వచ్చి అలర్ట్ అయ్యేసరికి.. మరో వాహనం పట్టుబడింది.

– స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలంలోని చింతలవీధి జంక్షన్ వద్ద ఎస్ఈబీ, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఒడిస్సా నుంచి గంజాయి అల్లూరి జిల్లా మీదుగా వెళ్ళిపోతున్నట్టు సమాచారంతో.. నిఘా పెంచారు. చింతల వీధి జంక్షన్ లో కాపు కాసారు. ఒక్కో వాహనం తనిఖి చేస్తున్నారు అధికారులు, సిబ్బంది. అప్పుడే ఓ బొలెరో వాహనం అనుమానాస్పదంగా వస్తూ ఉంది. దాన్ని ఆపేందుకు ప్రయత్నించే సరికి.. ఆపకుండా ముందుకు దూసుకెళ్లిపోయింది. ఆ వెంటనే మరో వాహనం వస్తూ ఉంది. అప్పటికే అప్రమత్తమైన సిబ్బంది.. వెనక వస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. దాన్ని ఆపి ప్రశ్నించేసరికి డ్రైవర్ పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి వాహనంలో.. తనిఖీలు చేశారు. రహస్య అరలో.. గంజాయిని గుర్తించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 738 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒకే వాహనంలో ఇంత భారీ ఎత్తున గంజాయి పట్టుబడడంతో.. అధికారులే అవాక్కయ్యారు. పట్టుబడిన గంజాయి విలువ 74 లక్షల వరకు ఉంటుందని అన్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ శ్రీనివాసరావు.

ఒరిస్సా టు విజయనగరం వయా…

– వాహనం స్వాధీనం చేసుకున్న అధికారులు పాడేరు ఎస్ ఈ బి స్టేషన్కు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించేసరికి.. ఒరిస్సా కంఠ గ్రామంలో కొనుగోలు చేసిన గంజాయిను విజయనగరం జిల్లా రామభద్రపురంకు తరలిస్తున్నట్లు చెప్పాడు. గంజాయితో వాహనాన్ని తీసుకెళ్లి అప్పగించేందుకు తనకు ట్రిప్ కు 15 వేల రూపాయలు ఇస్తున్నట్టు చెప్పాడు. గతంలో పలుమార్లు ఇలాగే చేసినట్టు వివరించడంతో అధికారులు అవాక్కయ్యారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నలుగురిని గుర్తించారు అధికారులు. వాళ్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. పరారిలో ఉన్న మరో నలుగురిని త్వరలో పట్టుకుంటామన్నారు అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…