Andhra Politics: ఏపీ పాలిటిక్స్‌లో సవాళ్ళ పర్వం.. సై అంటే సై అంటున్న వైసీపీ, టీడీపీ

ఏపీ పాలిటిక్స్‌లో ఇపుడు సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. ఈ ట్రెండ్ గతంలోను వున్నప్పటికీ ఈసారి పొలిటికల్ ఛాలెంజులు ఏపీ పాలిటిక్స్‌ను రక్తి కట్టిస్తున్నాయి.

Andhra Politics: ఏపీ పాలిటిక్స్‌లో సవాళ్ళ పర్వం.. సై అంటే సై అంటున్న వైసీపీ, టీడీపీ
Ap Politics
Follow us

|

Updated on: Apr 14, 2021 | 6:08 PM

Andhra Politics challenges between leaders: ఏపీ పాలిటిక్స్‌లో ఇపుడు సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. ఈ ట్రెండ్ గతంలోను వున్నప్పటికీ ఈసారి పొలిటికల్ ఛాలెంజులు ఏపీ పాలిటిక్స్ (AP POLITICS)‌ను రక్తి కట్టిస్తున్నాయి. తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి (YS VIVEKANANDA REDDY) హత్యోదంతంపై వైసీపీ (YCP), టీడీపీ (TDP) నేతల మధ్య సవాళ్ళ పర్వం హాట్ హాట్‌గా సాగుతోంది. వివేకా హత్యతో తమ కుటుంబానికిగానీ, తెలుగుదేశం పార్టీ (TELUGUDESHAM PARTY) లీడర్లకుగానీ సంబంధం లేదని ప్రకటించిన టీడీపీ (TDP) జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ (NARA LOKESH).. ఇదే అంశంపై తనకుగానీ, తన కుటుంబానికిగానీ ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CHIEF MINISTER YS JAGAN MOHAN REDDY) కూడా ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. అందుకు తిరుపతి (TIRUPATI)లోకి అలిపిరి (ALIPIRI) వద్ద తిరుమల వెంకటేశ్వర స్వామి (TIRUMALA VENKATESHWARA SWAMY) మీద ప్రమాణం చేస్తానంటూ బుధవారం (ఏప్రిల్ 14న) నారా లోకేశ్ ముందుకొచ్చారు. అన్నట్లుగానే బుధవారం ఆయన అలిపిరికి చేరుకుని సీఎంకు బహిరంగ సవాల్ విసిరారు.

తిరుపతి లోక్‌సభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ సవాళ్ళు జోరందుకున్నాయి. ఏప్రిల్ (APRIL) ఏడో తేదీన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. వైఎస్ వివేకా హత్యతో సంబంధం లేదని అలిపిరి వద్ద ఏప్రిల్ 14వ తేదీన వెంకన్నపై ప్రమాణం చేద్దాం రా అంటూ లోకేశ్ సవాల్ చేశారు. నారా లోకేశ్ ఛాలెంజ్‌కి నెల రోజుల ముందు టీడీపీ నేత బుద్దా వెంకన్న (BUDDA VENKANNA) కూడా ముఖ్యమంత్రి (CHIEF MINISTER)కి ఓ సవాల్ విసిరారు. మార్చి రెండో తేదీన మునిసిపల్ ఎన్నికల (AP MUNICIPAL ELECTIONS) సందర్భంగా ప్రచారానికి వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CHANDRABABU NAIDU)ను ఎయిర్‌పోర్టులోనే నిలువరించడంపై బుద్దా వెంకన్న సీఎంకు ఛాలెంజ్ విసిరారు. జగన్‌కు ప్రజాబలం వుంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఆయన చేసిన సవాల్ సారాంశం. అలా జరిగే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే, టీడీపీ దుకాణం మూసేస్తామని బుద్దా వెంకన్న ఛాలెంజ్ చేశారు.

గత సంవత్సరం డిసెంబర్ 26న విశాఖ కేంద్రంగా వైసీపీ ఎంపీ (YCP MP) విజయసాయిరెడ్డి (VIJAYASAI REDDY), టీడీపీ ఎమ్మెల్యే  (TDP MLA) వెలగపూడి రామకృష్ణబాబు మధ్య సవాళ్ళ పర్వం కొనసాగింది. వెలగపూడి భూఆక్రమణలకు పాల్పడ్డారంటూ విజయ సాయి చేసిన ఆరోపణలు సవాళ్ళ పర్వానికి తెరలేపాయి. విజయసాయి చేసిన ఆరోపణలపై స్పందించిన వెలగపూడి.. తనకు అక్రమ ఆస్తులున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అమర్‌నాథ్ సింహాద్రి అప్పన్న సాక్షిగా ప్రమాణం చేస్తావా అంటూ ఎదురు దాడి చేశారు. అక్రమాస్తులున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని వెలగపూడి సవాల్ చేశారు. అయితే.. సింహాద్రి (SIMHADRI) అప్పన్న గుడికి ఎంపీ విజయసాయి రావాలని డిమాండ్ చేశారు. ఈ ఛాలెంజ్‌కు విజయసాయి రావాల్సిన అవసరం లేదని, తాను చాలని విశాఖ వైసీపీ నేత విజయనిర్మల (VIJAYA NIRMALA) ముందుకొచ్చారు.

గత డిసెంబర్‌లోనే అవినీతి అంశం ఆధారంగా తూర్పుగోదావరి (EAST GODAVARI) అనపర్తిలో వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయం వేదిక ఇరువురి సత్యప్రమాణాలు జరిగాయి. డిసెంబర్ 25వ తేదీన టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గుంటూరు (GUNTUR) జిల్లా దాచేపల్లిలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు మీసం మెలేసి, తొడ గొట్టి మరీ ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ అప్పట్లో ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. టీడీపీ వాళ్లకు మా ఇంట్లో చంటోడు కూడా భయపడడంటూ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎదురు దాడి చేశారు. దాంతోపాటు దాచేపల్లి మండలం కేసానుపల్లిలో ఆయన చిన్న పిల్లాడితో తొడగొట్టించారు. దాదాపుగా అదే సమయంలో అంటే డిసెంబర్ 26వ తేదీన ఆశ్చర్యకరంగా విజయనగరం జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య సవాళ్ళు జరిగాయి. విజయనగరం రాజా వారి కోటలో చిరకాలంగా టీడీపీ ఆఫీసు కొనసాగుతుండగా.. పార్టీ ఆఫీసును మరో చోట పెట్టారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. ఈ విషయంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో కొంచెం వెనక్కి తగ్గిన గీత.. తిరిగి వారం రోజుల తర్వాత పార్టీ ఆఫీసు అంటూ వేరే చోట బోర్డు పెట్టి మాజీ మంత్రి అశోక గజపతి రాజు (ASHOKA GAJAPATI RAJU)కు పరోక్షంగా సవాల్ విసిరారు.

గత సంవత్సరం డిసెంబర్ 17 తేదీన అమరావతి (AMARAVATI) రాజధాని (CAPITAL) ఉద్యమానికి ఏడాది నిండిన సమయంలో జరిగిన సభలో ప్రసంగించిన చంద్రబాబునాయుడు.. రాజధానిపై ప్రజా తీర్పుకు వెళ్ళాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు సవాల్ విసిరారు. దానికి ధీటుగా స్పందించిన వైసీపీ మంత్రులు (YCP MINISTERS) చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్ళాలని ఎదురు దాడి చేశారు. ఈ సవాళ్ళ పర్వం ఓ వారం రోజుల పాటు రాజకీయ ప్రియులను అలరించాయి. గత సంవత్సరం (2020) సెప్టెంబర్ నెలలో ఏపీలో దేవాలయాల కూల్చివేత అంశంపై సవాళ్ళు, ప్రతిసవాళ్ళు కొనసాగాయి. వైసీపీ హాయంలో ఏపీలో ఒక్క ఆలయాన్ని కూడా కూల్చలేదని, ఏదైనా ఉదంతం జరిగినా అది ఉద్దేశ పూర్వకం కాదు అంటూ ఏపీ మంత్రి వెల్లంపల్లి ప్రకటించారు. టీడీపీ హయాంలో ఒక్క ఆలయం కూడా కూల్చలేదని కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేస్తారా చంద్రబాబు అంటూ వెల్లంపల్లి ఛాలెంజ్ విసిరారు.

అదే సెప్టెంబర్ నెలలో జ్యోతుల నెహ్రూ, పర్వతప్రసాద్ మధ్య సవాళ్ళ పర్వం కొనసాగింది. జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జ్యోతుల నెహ్రూ సహకార బ్యాంకులో నిధులు మింగారని ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఆరోపించారు. అయితే.. తాను అవినీతికి పాల్పడలేదన్న జ్యోతుల నెహ్రూ.. అన్నవరం దేవస్థానంలో దీపం ఆర్పి ప్రమాణం చేస్తానన్నారు. అంతకు ముందు 2020 ఏప్రిల్ నెలలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య సవాళ్ళ పర్వం కొనసాగింది. కన్నా లక్ష్మీనారాయణ (KANNA LAXMINARAYANA) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమ్ముడుపోయారంటూ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. అందుకుగానీ 20 కోట్ల రూపాయలు చంద్రబాబు వద్ద కన్నా తీసుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కన్నాతోపాటు మరో బీజేపీ (BJP) నేత సుజనాచౌదరి (SUJANA CHOUDARY) పై కూడా విజయసాయి విరుచుకుపడ్డారు. సుజనా షెల్ కంపెనీలతో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని ఆరోపించారు. ఈ రెండు అంశాలపై తిరుమల లేదా కాణిపాకం (KANIPAKAM)లలో ప్రమాణాలు చేసేందుకు రెడీ అయి ఆయన సవాల్ చేశారు. ప్రమాణానికి తాను సిద్దమని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. కానీ ఆ సవాళ్ళ పర్వం అంతటితో ఆగిపోవడం విచిత్రం. ‌ అంతకు ముందు నెల్లూరుకు చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య ఛాలెంజులు పర్వం కొనసాగింది. సోమిరెడ్డి మంత్రిగా వున్నప్పుడు రైస్ మిల్లర్ల నుంచి 50 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని కాకాణి ఆరోపించారు. సోమిరెడ్డికి సింగపూర్‌ (SINGAPORE)లో ఆస్తులున్నాయని వెల్లడించారు. ఈ ఆరోపణలపై స్పందించిన సోమిరెడ్డి తనకు విదేశాల్లో ఆస్తులు లేవని, కావాలంటే అందరికీ విమానం టిక్కెట్లు కొనిస్తానని, సింగపూర్ వెళ్ళి తనకు ఆస్తులున్న విషయాన్ని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. తనకు ముడుపులు ఇవ్వలేదన్న ప్రమాణా చేసేందుకు జిల్లాలోని రైస్ మిల్లర్లు కాణిపాకం ఆలయానికి వస్తారని సోమిరెడ్డి ప్రకటించారు. 2018లో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ఇసుక అక్రమాలు చేశారంటూ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన ఆరోపణలు కూడా రాజకీయ సవాళ్ళ పర్వానికి తెరలేపాయి. తానెలాంటి అవినీతికి పాల్పడలేదన్న పెందుర్తి తన తల్లిపై ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. రాజానగరం గాంధీబొమ్మ సెంటర్‌కు వచ్చి బహిరంగంగా ప్రమాణం చేశారాయన.

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి (GALI JANARDHAN REDDY)తో పయ్యావుల కేశవ్ (PAYYAVULA KESHAV)‌కు వ్యాపార లావాదేవీలున్నాయన్న వైసీపీ నేత గురనాథ రెడ్డి చేసిన ఆరోపణలు అనంతపురం పాలిటిక్స్‌లో చర్చనీయాంశమయ్యాయి. “నాకు గాలితో ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవు.. నేను కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మరి నువ్వు చేస్తున్న ఆరోపణలు నిజమేనని నువ్వు కూడా ప్రమాణం చేయగలవా..’’ అని పయ్యావుల సీరియస్ అయ్యారు. ఇక భోగాపురం టెంటర్ల రద్దు వెనుక ముడుపుల బాగోతం వుందని టీడీపీ నేత అశోకగజపతి రాజు చేసిన ఆరోపణలు కూడా కొన్ని రోజుల పాటు మీడియాలో నానాయి. తనపై ఆరోపణలు చేసిన అశోకగజపతి రాజు పైడితల్లి అమ్మవారి ముందు ప్రమాణం చేసేందుకు సిద్దమా అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురు దాడి చేశారు. ‌ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండబాబు మధ్య కూడా సవాళ్ళ పర్వం కొనసాగింది. ఎమ్మెల్యే తన పరపతిలో సొంత గోదాముల ఆస్తి పన్ను తగ్గించుకున్నారని కొండబాబు ఆరోపించారు. ప్రజలకు మాత్రం ఆస్తిపన్నులను పెంచి వాతపెట్టారని కొండబాబు ఆరోపించారు. అయితే దీనిపై తనతో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ చేశారు. రాజమండ్రి ఎంపీ భరత్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుల మధ్య కూడా సవాళ్ళ పర్వం కొనసాగింది. రాజానగరం నియోజకవర్గంలో గోదావరి వరదకు మునిగిపోయే ఆవభూముల సేకరణలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆదిరెడ్డి అప్పారావు ఆరోపించారు. దీనిపై చర్చకు రావాలని ఎంపీ భరత్ ఎదురుదాడి చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య ఇసుక అవినీతిపై ఛాలెంజులు కొనసాగాయి.

ALSO READ: వ్యాక్సినేషన్‌తోనే కరోనాకు చెక్.. ఆ దేశాల విజయ రహస్యమిదే!

ALSO READ: దేశంలో పలువురు ముఖ్యమంత్రులకు కరోనా.. ఎవరెవరికి ఎప్పుడంటే?