సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద దక్షిణ ఛత్తీస్‌గఢ్ & పరిసరాల్లో ఉపరితల అవర్తనము ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రిపో ఆవరణం లో దక్షిణ లేదా నైరుతి దిశ లో గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది వెదర్ డిపార్ట్‌మెంట్.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————
శనివారం :- తేలికపాటి వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ఆదివారం, సోమవారం :- తేలికపాటి వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగం తో వీయవచ్చు. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది..
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
శవివారం, ఆదివారం, సోమవారం:- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ :-
——————-
శవివారం, ఆదివారం, సోమవారం:- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..