Andhra Pradesh: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ విచారణలో సీఐడీ దూకుడు.. వెలుగులోకి సంచలన విషయాలు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. సీమెన్స్‌ మాజీ ఉద్యోగి జీవీఎస్‌ భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు.. ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. GGHలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Andhra Pradesh: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ విచారణలో సీఐడీ దూకుడు.. వెలుగులోకి సంచలన విషయాలు
Ap Skill Development Scam

Updated on: Mar 09, 2023 | 4:40 PM

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. సీమెన్స్‌ మాజీ ఉద్యోగి జీవీఎస్‌ భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు.. ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. GGHలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా సీఐడీ కోర్టుకు తరలించారు. ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఇష్యూలో.. సీఐడీ దూకుడు పెంచింది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషించినట్లు విచారణ సంస్థ గుర్తించింది. ప్రోగ్రామ్ అసలు ధర 58కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే.. దాన్ని భాస్కర్ 3వేల 300 కోట్లుగా ప్రభుత్వానికి చూపించారని సీఐడీ చెప్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలోని కొంతమంది సాయంతో ఈ మోసానికి పాల్పడ్డారనేది సీఐడీ అభియోగం. మొత్తం 3300 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కింద 371కోట్లు ఇవ్వాల్సి ఉండగా… ప్రైవేటు సంస్థలు మిగిలిన వ్యయం భరించాలి. ప్రైవేటు వాటా డబ్బుకు సంబంధించి ఎంవోయూలో ఎలాంటి ప్రస్తావన లేకుండా… కేవలం ప్రభుత్వం వాటా 371కోట్ల వర్క్ ఆర్డర్‌ రిలీజ్ చేసే విధంగా ఎంవోయూను భాస్కర్ మార్చేసినట్లు గుర్తించారు .

యూపీ క్యాడర్ ఐఏఎస్ అయిన తన భార్య అపర్ణను స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ డిప్యూటీ సీఈఓగా నియమించుకునేందుకు భాస్కర్… అప్పటి సీఈఓ సుబ్బారావుతో ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు సీఐడీ విచారణలో తేలింది. అపర్ణను డిప్యూటీ సీఈఓగా నియమించుకునే సమయంలో తమకు ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉందని ఎక్కడా బయటకురానివ్వలేదని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..