‘అమరావతిలో 4,069 ఎకరాలు బినామీ పేర్లతో కొనుగోళ్లు’
రాజధాని అమరావతిలో బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారని సంచలన ప్రకటన చేశారు వైస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందన్న ఆయన....
రాజధాని అమరావతిలో బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారని సంచలన ప్రకటన చేశారు వైస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందన్న ఆయన.. ఈ భారీ కుంభకోణంలో త్వరలోనే ఆశ్చర్యకర విషయాలు బయటకి రాబోతున్నాయని చెప్పారు. చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారని.. ఈ స్కాం పై సీబీఐ విచారణ వెయ్యమని జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని వెల్లడించారు. తప్పు చెయ్యకపోతే సీబీఐ వెయ్యమని కేంద్రాన్ని కోరండి..అని చంద్రబాబుకి సూచించారు అంబటి. తప్పు చేశారు కనుకే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదని అంబటి అన్నారు. ఏపీ డీజీపీపై హైకోర్ట్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్న ఆయన.. న్యాయస్థానలపై తమకు గౌరవం ఉందని చెప్పారు. హైకోర్టులో కామెంట్స్ పై సమాధానం చెప్పలేము.. ఆర్డర్ పై మాత్రమే సమాధానం చెప్పగలమని అంబటి పేర్కొన్నారు.