ఏపీ: విద్యార్థులు లేకుండానే అడ్మిషన్లు.. స్కూళ్ల రీ-ఓపెన్‌పై క్లారిటీ.!
కరోనా విరామం తర్వాత పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఏపీ విద్యాశాఖ పలు మార్గదర్శకాలను ఖరారు చేసింది.

Admission Process In Schools AP: కరోనా విరామం తర్వాత పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఏపీ విద్యాశాఖ పలు మార్గదర్శకాలను ఖరారు చేసింది. విద్యార్థులు లేకుండానే స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ జరగాలని డీఈవోలను ఆదేశించింది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతుల వరకు విద్యార్ధులందరినీ ప్రమోట్ చేశారు కాబట్టి.. సర్టిఫికెట్లు, ఇతర ధృవపత్రాల కోసం వారిని ఇబ్బంది పెట్టకుండా చేర్చుకోవాలని తెలిపింది.
అలాగే 5, 7వ తరగతుల విద్యార్థులు తదుపరి చదువుల కోసం చేరదల్చుకున్న స్కూళ్లకు… హెడ్ మాస్టర్లు టీసీ, ఇతర వివరాలతో పాటు తల్లిదండ్రుల సమ్మతి లేఖను జత చేసి లిఖితపూర్వకంగా తెలియజేయాలని విద్యాశాఖ సూచించింది. అటు ఉపాధి కూలీల పిల్లలను సైతం ఎలాంటి గుర్తింపు పత్రాలు అడగకుండానే పాఠశాలలోకి ప్రవేశాలు కల్పించాలని.. టీసీ కోసం ఒత్తిడి చేయకూడదని తెలిపింది.
అంతేకాదు తల్లిదండ్రుల సమ్మతి లేకుండా ఏ విద్యార్థిని ఇతర స్కూళ్లకు పంపకూడదని స్పష్టం చేసింది. కాగా, అక్టోబర్ 5వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభించేందుకు ప్రాధమికంగా నిర్ణయం తీసుకున్నా.. కేంద్రం నుంచి లాక్ డౌన్ నిబంధనల ప్రకటన వచ్చిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందన్నారు.
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్
‘కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు.. ఆధారాలు ఉన్నాయి’




