Ambati Rambabu: ఆహా షో హిట్.. ‘నందమూరి – నారా’ పరువు ఫట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..

|

Oct 15, 2022 | 4:29 PM

ఎన్టీఆర్‌ను చంపి.. ఆయన ఆశయాలు సాధిస్తారా..? అధికారం కోసం గోతి కాడ నక్కలా కూచుక్కూర్చున్న బాబు రియల్ విలన్ అంటూ ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.

Ambati Rambabu: ఆహా షో హిట్.. ‘నందమూరి - నారా’ పరువు ఫట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..
Ambati Rambabu
Follow us on

ఎన్టీఆర్‌ను చంపి.. ఆయన ఆశయాలు సాధిస్తారా..? అధికారం కోసం గోతి కాడ నక్కలా కూచుక్కూర్చున్న బాబు రియల్ విలన్ అంటూ ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2.. కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీటెక్కించాయి. దీనిపై మంత్రి అంబటి రాంబాబు శనివారం మాట్లాడారు. బాబు వెన్నుపోటు రక్తపు మరకను చెరిపేసే ప్రయత్నమే ఇది అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు టాక్ షో కి పరిమితమయ్యాడని విమర్శించారు. అప్పుడు, ఇప్పుడూ బాబుకు తానా తందానా అంటూ బామ్మర్ది బాలకృష్ణ నిలుస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అడ్డుకుంటున్న బాబు, పవన్ కల్యాణ్ లు మూల్యం చెల్లిస్తారని తెలిపారు. పోగాలం దాపురించి టీడీపీ తీసుకున్న నిర్ణయాలతో మూడు ప్రాంతాల ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఆహా షో హిట్.. “నందమూరి-నారా” పరువు ఫట్ అంటూ ఈసందర్భంగా కామెంట్స్ చేశారు. ఆ షో కు లక్ష్మీపార్వతి, నాదెండ్ల భాస్కరరావులను పిలిస్తే వాస్తవాలు తెలిసేవని తెలిపారు. లోకేష్ ఒక బఫూన్.. బాలకృష్ణ అమాయకుడు, అసమర్థుడు అంటూ విమర్శించారు. వైఎస్ఆర్ స్నేహితుడు అని చెబుతున్న బాబు.. వైఎస్ గారి దగ్గర పాకెట్ మనీ తీసుకున్నానని చెప్పడేం..? అంటూ ప్రశ్నించారు.

ఆ టాక్‌ షో ఆద్యంతాన్ని పరిశీలించిన తర్వాత దానిలో వారు మాట్లాడిన మాటలు, వారు ప్రదర్శించిన డ్రామాలు, వారి అబద్ధాలపై స్పందించాలనిపించిందని.. అంబటి మీడియాకు తెలిపారు. టాక్‌ షోను నిర్వహించేది బాలకృష్ణ. బాలయ్యకు చంద్రబాబు బావ అవుతారు, లోకేష్‌ అల్లుడు అవుతాడు. వీళ్లంతా కూర్చుని ఒక షో నడిపారు. దీనిలో విచిత్రమైన అంశం ఏంటంటే.. లోకేష్‌ అనే వ్యక్తి ఒక హాస్యనటుడిలా ఉన్నాడన్నారు. సినిమాలు, రాజకీయాలు, నిత్య జీవితంలో కూడా కొంతమంది హాస్యాన్ని పోషించేవాళ్లు ఉంటారని విమర్శించారు. చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ స్థాయిలో ఉన్నారు.. బాలకృష్ణ సమర్థుడు అయితే చంద్రబాబు తన తమ్ముడు స్థాయిలో ఉండేవారు.. అర్హతలు ఏమీ లేకపోయినా కుట్రలు, కుతంత్రాలు, మోసం, దగా రాజకీయాలతో అందలం ఎక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడని తెలిపారు.

బాబు వెన్నుపోటు మరకను చెరిపివేసేందుకే..

ఇవి కూడా చదవండి

మొత్తం టాక్‌ షో చూస్తే బాలకృష్ణ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చూస్తే.. చంద్రబాబు 27 సంవత్సరాల క్రితం జరిగిన వెన్నుపోటు రక్తపు మరకను తుడిచేసుకునే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. బామ్మర్ది, బావ కలిసికట్టుగా రక్తపు మరకను తుడిచేసుకునేలా చేసిన ప్రయత్నం చాలా బాధ కలిగించిందన్నారు.

ఉత్తరాంధ్రపై టీడీపీ, జనసేన దాడే ఇది..

మూడు రాజధానులకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లేనంటూ అంబటి పేర్కొన్నారు. ఓ వైపు విశాఖ గర్జన జరుగుతుంటే.. పవన్‌ కల్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్లారు. అమరావతికి మద్దతుగా టీడీపీ రౌండ్‌టేబుల్‌ సమావేశం పెట్టింది. ఇవి ఏం పనులని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపైన, విశాఖపట్నంపైన దాడి చేసేలా వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ దాడిని విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు తిప్పికొడతారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం.. చరిత్రలో నిలిచిపోయే పోరాటంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దీంతో టీడీపీ పార్టీ పతనం ప్రారంభమైందని.. వైసీపీ 175 సీట్లు వస్తాయని అంబటి రాంబాబు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..