ఏపీ కొత్త స్పీకర్‌గా తమ్మినేని సీతారాం..

ఏపీ అసెంబ్లీలో కొత్త స్పీకర్‌గా ఎవరు ఎంపిక కాబోతున్నారనే సస్పెన్స్‌కు దాదాపుగా తెరపడింది. స్పీకర్ పోస్టుకు సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వైసీపీఎల్పీ సమావేశం తరువాత తమ్మినేని సీతారాం సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీంతో ఆయనను స్పీకర్ పదవికి ఎంపిక చేశారనే వార్తలు మరింతగా బలపడ్డాయి. ఇక ఇదే జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్‌‌కి మంత్రి పదవి కన్ఫార్మ్ అయినట్టు సమాచారం. అయితే […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:11 pm, Fri, 7 June 19
ఏపీ కొత్త స్పీకర్‌గా తమ్మినేని సీతారాం..

ఏపీ అసెంబ్లీలో కొత్త స్పీకర్‌గా ఎవరు ఎంపిక కాబోతున్నారనే సస్పెన్స్‌కు దాదాపుగా తెరపడింది. స్పీకర్ పోస్టుకు సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వైసీపీఎల్పీ సమావేశం తరువాత తమ్మినేని సీతారాం సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీంతో ఆయనను స్పీకర్ పదవికి ఎంపిక చేశారనే వార్తలు మరింతగా బలపడ్డాయి. ఇక ఇదే జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్‌‌కి మంత్రి పదవి కన్ఫార్మ్ అయినట్టు సమాచారం.

అయితే జిల్లా నుంచి ఒకరినే కేబినెట్‌లోకి తీసుకోవాలని డిసైడయిన సీఎం జగన్… తమ్మినేనికి స్పీకర్‌ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ(కళింగ) సామాజికవర్గానికి చెందిన తమ్మినేని సీతారాం… గతంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఆ తరువాత చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరిన తమ్మినేని… ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లోనూ ఓటమి చవిచూసిన తమ్మినేని… ఈసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తంగా ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.