YSRCP vs TDP: సభలో వ్యక్తిగత దూషణల పర్వం.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన అంబటి రాంబాబు

Nara Chandrababu Naidu: చంద్రబాబు కుటుంబంపై తాను ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో తీవ్ర వ్యక్తిగత ధూషణల అనంతరం..

YSRCP vs TDP: సభలో వ్యక్తిగత దూషణల పర్వం.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన అంబటి రాంబాబు
Ambati

Updated on: Nov 19, 2021 | 2:32 PM

చంద్రబాబు నాయుడు కుటుంబంపై తాను ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో తీవ్ర వ్యక్తిగత ధూషణల అనంతరం.. తన భార్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అంబటి రాంబాబుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను మంత్రులు, వైసీపీ సభ్యులు అవమానిస్తున్నారని, తాను ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి సభకు వస్తానంటూ ఆయన సభ నుంచి వెళ్లిపోయారు.

సభలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన అంబటి రాంబాబు.. చంద్రబాబు నాయుడు చివరి అస్త్రంగానే సింపతీకార్డు ప్రయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాధవరెడ్డి పేలుడు ఘటనలో మరణించారని, దీని వెనుక చంద్రబాబు ప్రమేయముందన్న పుకార్లు ఉన్నాయని అన్నారు. సభలో ఈ అంశం మీద కూడా చర్చించాలని తాను అన్నట్లు పేర్కొన్నారు. అయితే తాను చంద్రబాబు భార్య మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే సభకు వస్తానని శపథం చేస్తున్నారని.. ఆయన ఎప్పటికి సీఎం కావాలంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు రోబోలాంటి వ్యక్తి..ఆయన కళ్ల నుంచి నీళ్లు రావని వ్యాఖ్యానించారు.

అంబటి రాంబాబుతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్..

Also Read..

Chandrababu: మీడియా ముందు బోరున విలపించిన చంద్రబాబు.. తీవ్ర భావోద్వేగం

Ravva Laddu: కొత్త తరం కోసం పాత తరం స్వీట్.. టేస్టీ టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు తయారీ..