AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

74 ఏళ్ల ‘తల్లి బామ్మ’కు సీరియస్.. ఐసీయూలో..!

ఈ పైన ఫొటోలో చూస్తోన్న బామ్మను గుర్తుపట్టారు కదా..! ఈ 74 ఏళ్ల బామ్మ.. ఈ వయసులో తల్లి అయి రికార్డు సృష్టించింది. పెళ్లై 57 ఏళ్లు అయినా.. పిల్లలు లేకపోవడంతో.. ఈ దంపతులు చాలా బాధపడ్డారు. వారికి తెలిసినవారి ద్వారా.. సరోగసి చేయించుకుని.. పెద్దవయసులో.. తల్లిదండ్రులు అయ్యారు. వీరికి ఇద్దరు కవలలు (ఆడపిల్లలు) జన్మించారు. దీంతో.. ఆ ముసలి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా ఆమెకు […]

74 ఏళ్ల 'తల్లి బామ్మ'కు సీరియస్.. ఐసీయూలో..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2019 | 1:28 PM

Share

ఈ పైన ఫొటోలో చూస్తోన్న బామ్మను గుర్తుపట్టారు కదా..! ఈ 74 ఏళ్ల బామ్మ.. ఈ వయసులో తల్లి అయి రికార్డు సృష్టించింది. పెళ్లై 57 ఏళ్లు అయినా.. పిల్లలు లేకపోవడంతో.. ఈ దంపతులు చాలా బాధపడ్డారు. వారికి తెలిసినవారి ద్వారా.. సరోగసి చేయించుకుని.. పెద్దవయసులో.. తల్లిదండ్రులు అయ్యారు. వీరికి ఇద్దరు కవలలు (ఆడపిల్లలు) జన్మించారు. దీంతో.. ఆ ముసలి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా ఆమెకు ఇటీవలే కాన్పు చేశారు డాక్టర్లు. ఆమె అప్పట్లో క్షేమంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు తెలిపారు.

Worlds oldest Mother and her Husband in Intensive Care unit

ఇప్పుడు వీరి గురించి మళ్లీ ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. ఈ వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తాలూకూ.. ఆరోగ్య సంబంధమైన సమస్యలు రావడంతో.. మంగాయమ్మ అనే ఈ బామ్మ మళ్లీ తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటోంది. ఇక.. ఆమె భర్త ఎర్రమట్టి రాజారావుకు కూడా హార్ట్‌ఎటాక్‌తో ఆస్పత్రిలో చేరారు. దీంతో.. వీరి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

Worlds oldest Mother and her Husband in Intensive Care unit

కవలపిల్లల పుట్టుక సందర్భంగా మంగాయమ్మ దాదాపు మూడు గంటలపాటు తీవ్రమైన నొప్పులు అనుభవించిందని, దీంతో.. ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందించవలసివచ్చిందని ఉమాశంకర్ అనే డాక్టర్ తెలిపారు. ఇక తన భర్త రాజారావు పరిస్థితి ఇంక సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. హఠాత్తుగా తన భార్య అనారోగ్యానికి గురి కావడంతో ఆయన తట్టుకోలేక గుండెపోటుకు గురైనట్టు డాక్టర్లు తెలిపారు. లేటు వయసులో పండంటి కవలలకు తల్లిదండ్రులైన వీరి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉండటం విచారకరం.