AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

75% స్థానికతపై ట్వీట్‌ వార్!

ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి ఉద్యోగాలు తగ్గిపోతాయంటూ ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక కథనాన్ని వెలువరించింది. దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందని ఆ కథనంలో అభిప్రాయపడింది. రాజ్యాంగం దేశంలోని పౌరులందరూ ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు వీలు కల్పించిందని.. ఏపీ ప్రభుత్వం […]

75% స్థానికతపై ట్వీట్‌ వార్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 29, 2019 | 8:52 PM

Share

ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి ఉద్యోగాలు తగ్గిపోతాయంటూ ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ పత్రిక కథనాన్ని వెలువరించింది. దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందని ఆ కథనంలో అభిప్రాయపడింది. రాజ్యాంగం దేశంలోని పౌరులందరూ ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పనిచేసుకునేందుకు వీలు కల్పించిందని.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల పెట్టుబడులు, ఉత్పత్తిపై పెను ప్రభావం పడుతుందని ఆ కథనంలో పేర్కొంది. ఈ కథనాన్ని జత చేసి నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

దీనిపై ఏపీ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌ స్పందించారు. ‘‘మీ కామెంట్లు.. ఆ కథనం పూర్తిగా అసమగ్ర సమాచారంతో కూడినవి’’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీట్వీట్‌ చేశారు. స్థానికేతరులకు అవకాశాలు తగ్గించడం ద్వారా ఏపీలోని స్థానికులకు తగినన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. దీనిలో సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే ఉద్దేశమేదీ లేదని పేర్కొన్నారు. దీనిపై అమితాబ్‌ కాంత్‌ స్పందిస్తూ ఇవి తన వ్యాఖ్యలు కావని.. ఆ పత్రిక కథనాన్ని మాత్రమే తాను పోస్ట్‌ చేసినట్లు రీట్వీట్‌ చేశారు.

Follow Us
ఇంట్లోనే కేవలం కప్పు శనగపప్పుతో ఇలా ట్రై చేయండి.. సూపర్ వస్తుంది.
ఇంట్లోనే కేవలం కప్పు శనగపప్పుతో ఇలా ట్రై చేయండి.. సూపర్ వస్తుంది.
అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?
అదీ లెక్క.. స్మశానం కోసం ఊరు ఊరంతా ఏకమై ఏం చేశారంటే..?
చావు లేని జీవితం కోసం బిలియనీర్ సాహసం..!
చావు లేని జీవితం కోసం బిలియనీర్ సాహసం..!
ఏం కొనేటట్టు లేదు.. రైతు బాజార్‌లో నేటి కూరగాయలు, సరుకుల ధరలివే!
ఏం కొనేటట్టు లేదు.. రైతు బాజార్‌లో నేటి కూరగాయలు, సరుకుల ధరలివే!
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
40 ఏళ్లకు ముందే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలంటే.. ఈ పనులు చేయండి
హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొనాలని ఉందా..? ఇదే మంచి అవకాశం..
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు